Egg Prices: సామాన్యులకు ఊరట.. పడిపోయిన కోడిగుడ్ల ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?

Egg Prices: సామాన్యులకు ఊరట.. పడిపోయిన కోడిగుడ్ల ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?


సామాన్యులకు గుడ్‌న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరల భారీగా తగ్గాయి. ఒకేసారి వీటి ధరలు పడిపోయాయి. మొన్నటివరకు కోడిగుడ్ల ధరలు ఆకాశాన్నంటాయి. ఒక్కొ గుడ్డు ధర రిటైల్ మార్కెట్లో రూ.10 పలికింది. కానీ ఇప్పుడిప్పుడే ధరలు దిగొస్తుండటంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. సామాన్యులకు తక్కువ ఖర్చులో అందుబాటులో ఉండే పదార్ధంగా కోడిగుడ్డుని పరిగణిస్తారు. ప్రతీ ఇంట్లో తరచూ గుడ్లను తింటూ ఉంటారు. ధరలు పెరగడంతో మొన్నటివరకు కోడిగుడ్లు తినేందుకు ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు పండుగల సీజన్ ముగియడం, డిమాండ్ లేకపోవడంతో కోడిగుడ్ల ధరలు గణనీయంగా తగ్గిపోయాయి.

ఇప్పుడు ఒక్కో గుడ్డు ఎంతంటే..?

ప్రస్తుతం ఒక్కో కోడిగుడ్డు ధర రూ.6 పలుకుతోంది. గత నెలలో ఈ ధర ఏకంగా రూ.10కి చేరుకుంది. దీంతో సామాన్యులు కోడిగోడ్డుకు దూరమయ్యారు. ఇప్పుడు ధరల తగ్గడంతో సామాన్యులకు ఉపశమనం లభించింది. ఇక రిటైల్ షాపుల్లో రూ.6కి విక్రయిస్తుండగా.. హోల్‌సేల్ మార్కెట్లో ధర మరింత తగ్గింది. ప్రస్తుతం హోల్‌సేల్ షాపుల్లో ఒక్కో గుడ్డు ధర రూ.5కే లభిస్తోంది. దీంతో హోటల్స్, బేకరీలతో పాటు వీధి వ్యాపారం చేసేవారికి పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ఇక గుడ్ల ధరలు తగ్గడంతో సేల్స్ పెరగడం వల్ల హోల్‌సేల్ యజమానులకు కూడా లాభం జరుగుతుందని చెప్పవచ్చు.

తగ్గడానికి రీజన్ ఇదే..

కోళ్ల ఉత్పత్తి పెరగడంతో గుడ్ల ఉత్పత్తి కూడా ఆమాంతం పెరిగింది. గుడ్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతుండగా.. సరఫరా తక్కువగా ఉంది. దీని వల్ల డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయినట్లు పాల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఇక కోళ్లకు పెట్టే దాణా ఖర్చులు కూడా తగ్గుముఖం పట్టాయి. దీంతో కోడిగుడ్ల ధరలు తగ్గినట్లు చెబుతున్నారు. త్వరలో వేసవికాలం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ధరలు స్థిరంగా ఉండటంతో వినియోగదారులు ఊరట చెందుతున్నారు.

తగ్గిన చికెన్ ధరలు

అటు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కూడా తగ్గిపోయాయి. గత నెలలో సంక్రాంతి పండుగ డిమాండ్ కారణంగా చికెన్ ధరలు కొండెక్కాయి. కేజీ చికెన్ ఏకంగా రూ.350కి చేరుకుంది. ప్రస్తుతం రూ.100 మేర ధరలు తగ్గాయి. ప్రస్తుతం షాపుల్లో కేజీ చికెన్ రూ.240 నుంచి రూ.250 మధ్య లభిస్తోంది. అటు గత నెలలో కేజీ మటన్ రూ.1500 వరకు చేరుకోగా.. ఇప్పుడు మళ్లీ సాధారణ ధరకు చేరుకున్నాయి. కేజీ మటన్ రూ.700 నుంచి రూ.800 మధ్య పలుకుతోంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ధరలు పతనమయ్యాయని చెప్పవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *