Eesha Rebba: వారిపై చర్యలు తీసుకోండి..! పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బ

Eesha Rebba: వారిపై చర్యలు తీసుకోండి..! పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్ ఈషా రెబ్బ


ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా లో సెలబ్రెటీల పై విపరీతమైన ట్రోలింగ్స్, విమర్శలు ఎక్కువయ్యాయి. కొందరు కేటుగాళ్లు సెలబ్రెటీల ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అసభ్యకరమైన ఫోటోలు షేర్ చేయడం, పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయడంలాంటివి చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది దీని పై పోలీసులను ఆశ్రయించారు కూడా.. కొందరు స్టార్ హీరోలు , హీరోయిన్స్ కూడా తమ అనుమతి లేకుండా ఫోటోలు వాడుకోవద్దు అంటూ కోర్టులను కూడా ఆశ్రయించారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పై సోషల్ మీడియా లో వచ్చిన కామెంట్స్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ.

తాజాగా ఈషా రెబ్బ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఇన్స్టాగ్రామ్ లో తాను పెట్టిన పోస్ట్ కు అసభ్యంగా కామెంట్స్ పెట్టిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది హీరోయిన్ ఈషా రెబ్బ. కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.

ఒక వ్యక్తి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అసభ్యంగా కామెంట్స్ పెట్టినట్టు గుర్తించారు పోలీసులు. ఇక ఈషా రెబ్బ విషయానికొస్తే చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలు పెట్టిన ఈషా రెబ్బ.. ఆతర్వాత హీరోయిన్ గా మారింది. అలాగే సెకండ్ హీరోయిన్ గాను మెప్పించింది. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. ఇక ఇటీవలే ఓం శాంతి శాంతి శాంతిః అనే సినిమాలో నటించింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *