
అరిటాకులో భోజనంతో వంటల రుచి పెరుగుతుందంటారు. అరిటాకుకు సహజంగా మంచి సువాసన ఉంటుంది. దీనిలో వేడి వేడి ఆహారాన్ని పెట్టే సరికి అది ఆహారానికీ మరింత రుచిని పెంచుతుంది. పైగా దీని నుంచి ఎలాంటి రసాయనిక పదార్థాలూ విడుదల కావు. కాబట్టి, అరటి ఆకులో భోజనంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. అరిటాకులు ఈకో ఫ్రెండ్లీ.. ఇవి బయోడ్రీగేడెబుల్. ప్లాస్టిక్‌కి మంచి ప్రత్యామ్నాయం. ముఖ్యంగా అరిటాకులో భోజనం చేయటం వల్ల పండుగ, వేడుక జరుగుతోందనే అనుభవం కలుగుతుంది.
అరటి ఆకులో భోజనంతో మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. అరిటాకులో సహజంగానే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల అరటి ఆకులో పెట్టిన ఆహారంలో ఏమైనా సూక్ష్మజీవులు ఉన్నట్లయితే అవి సహజంగా తొలగిపోతాయి. అందువల్ల ఆహార సంబంధంగా వచ్చే అనేక వ్యాధులు మనకు రాకుండా ఉంటాయి. అరిటాకుల్లో పాలీఫినాళ్లు, విటమిన్ ఏ, విటమిన్ సీ తదితర పోషకాలు ఉంటాయి. అరటి ఆకులో తిన్నప్పుడు ఇవన్నీ ఆహారంలోకి బదిలీ అవుతాయి. దీని వల్ల ఆహారంలో పోషకాలు మరింత పెరుగుతాయి.
అరటి ఆకులు ప్లాస్టిక్ లేదా థర్మాకోల్ ప్లేట్‌లతో పోలిస్తే విషపూరితం కాదు, కాబట్టి హానికరమైన రసాయనాలు ఆహారంలో చేరవు. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అరటి ఆకులపై ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియపై సానుకూల ప్రభావం ఉంటుంది. అరటి ఆకులలో ఉండే పాలీఫెనాల్స్ జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి మంచి జీర్ణక్రియ, పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..