Drug Case: డ్రగ్స్ కేసులో తమిళ్ నటుడు కృష్ణ అరెస్ట్.. విచారిస్తున్న పోలీసులు

Drug Case: డ్రగ్స్ కేసులో తమిళ్ నటుడు కృష్ణ అరెస్ట్.. విచారిస్తున్న పోలీసులు


సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం కలకలం రేపుతోంది. గతంలోనూ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం బయట పడింది. పలువురిని పోలీసులు  విచారించారు కూడా.. తాజాగా మరోసారి డ్రగ్స్ కేసులో ఓ నటుడు అరెస్ట్ అయ్యాడు. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ నటిస్తోన్న ఒక ఫేమస్ నటుడు డ్రగ్స్‌తో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ప్రస్తుతం చెన్నైలోనే స్థిరపడిన ఆ హీరోను చెన్నై నార్కోటిక్స్ ఇంటలిజెన్స్ టీమ్ అదుపులోకి తీసుకుంది. అతను ఎవరో కాదు హీరో శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్. ఏఐడీఎంకే మాజీ నేత నుంచి నటుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ పెడ్లర్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు హీరోను విచారిస్తున్నారు. విచారణలో భాగంగా మరికొందరు తమిళ నటుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాగా ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరో నటుడు కృష్ణ పై కూడా ఆరోపణలు వచ్చాయి. కృష్ణ కూడా మాదక ద్రవ్యాలను వాడినట్లు సమచారం అందడంతో పోలీసులు ఆయన్ని విచారించాలని నిర్ణయించారు. అయితే కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్ళాడు అతని కోసం పోలీసులు గాలించారు. ఎట్టకేలకు కృష్ణ పోలీసులకు చిక్కాడు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో నటుడు శ్రీకాంత్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, నటుడు కృష్ణను అరెస్టు చేయడానికి 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దీని తరువాత, జూన్ 25, 2025న, పోలీసులు కృష్ణను అరెస్టు చేసి రాత్రంతా విచారించారు పోలీసులు.  ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నాడు కృష్ణ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *