DIY Face Packs: మేకప్, కాలుష్యంతో మసకబారిన మీ అందాన్ని తిరిగి పొందండి..!

DIY Face Packs: మేకప్, కాలుష్యంతో మసకబారిన మీ అందాన్ని తిరిగి పొందండి..!


DIY Face Packs: మేకప్, కాలుష్యంతో మసకబారిన మీ అందాన్ని తిరిగి పొందండి..!

రోజూ మేకప్ వాడటం, కాలుష్యం, దుమ్ము, ధూళి అధిక ఆయిల్ ఉత్పత్తి వంటి కారణాలతో చర్మం రంగు కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి సమస్యలకు ఇంటి వంటింట్లో దొరికే పదార్థాలతో సహజ పద్ధతిలో పరిష్కారం అందించవచ్చు. ఈ చర్మ సంరక్షణ చిట్కాలు వాడితే ముఖం మళ్లీ ప్రకాశవంతంగా మారుతుంది.

శనగపిండి, పెరుగు ఫేస్ ప్యాక్

రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి, మూడు టేబుల్ స్పూన్ల పెరుగు చిటికెడు పసుపు కలిపి మెత్తని పేస్ట్ తయారు చేయాలి. దీన్ని ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది ముఖంపై ఉన్న నల్ల మచ్చలను, మొటిమల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.

శనగపిండి, ఓట్స్ స్క్రబ్

మూడు టీ స్పూన్ల శనగపిండిలో, ఒకటిన్నర టీ స్పూన్ల ఓట్స్ పొడి, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ పెరుగు, చిటికెడు పసుపు కలిపి పేస్ట్ చేయాలి. ముఖానికి ఈ మిశ్రమాన్ని అప్లై చేసి 15 నిమిషాల పాటు స్క్రబ్ చేసిన తర్వాత కడిగేయాలి. ఇది డెడ్ స్కిన్‌ ను తొలగించి చర్మాన్ని మృదువుగా తాజాగా మారుస్తుంది.

శనగపిండి, టొమాటో ఫేస్ ప్యాక్

ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూన్ తాజా టమాటా రసం ఒక స్పూన్ పెరుగు కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేయాలి. ఈ మిశ్రమం మచ్చలు తగ్గించడంలో చర్మానికి సహజ మెరుపును అందించడంలో సహకరిస్తుంది.

శనగపిండి, ఆలివ్ ఆయిల్ ఫేస్ ప్యాక్

రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిలో చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్ తయారు చేయాలి. ముఖం మెడపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది చర్మాన్ని తళతళలాడేలా చేస్తుంది. మృదుత్వాన్ని పెంచుతుంది.

కెల్ప్ పౌడర్, అలొవెరా ఫేస్ ప్యాక్

రెండు టీ స్పూన్ల కెల్ప్ పొడిని తాజా అలొవెరా గుజ్జుతో బాగా కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మంపై ఉన్న ముడతలు, వయసుతో వచ్చే మార్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. పది నిమిషాల తరువాత కడిగేయాలి. ఇది చర్మానికి తాజా మెరుపును అందిస్తుంది.

కెల్ప్, బొప్పాయి ఫేస్ ప్యాక్

ఒక స్పూన్ కెల్ప్ పిండి, ఒక స్పూన్ బొప్పాయి గుజ్జు ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగితే, నలుపు మచ్చలు తగ్గి చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే వాడాలి)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *