Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..


డైరెక్టర్ రాజమౌళి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన తెరకెక్కించే మూవీస్ కోసం మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తుంటారు. ఇప్పటికే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో చరిత్ర సృష్టించిన జక్కన్న.. ఇప్పుడు వారణాసి సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. 2024లో విడుదలైన ఈ మూవీ షూటింగ్.. ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది. ఇన్నాళ్లు SSMB29 వర్కింగ్ టైటిల్ ఉండగా.. గతేడాది నవంబర్ లో టైటిల్ తోపాటు గ్లింప్స్ సైతం రిలీజ్ చేశారు. ఇందులో మహేష్ బాబు లుక్స్, పాత్ర గురించి ఆసక్తికర విషయాలను రివీల్ చేశారు. అలాగే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అదే సమయంలో మహేష్ బాబు, ప్రియాంక, పృథ్వీరాజ్, రాజమౌళి పలు హాలీవుడ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.ఇప్పుడు వాటిని రిలీజ్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి: Uday Kiran : ఆ చెత్త సినిమాలే నా కెరీర్‏ను నాశనం చేశాయి.. ఉదయ్ కిరణ్ ఎమోషనల్ కామెంట్స్..

15 ఏళ్ల క్రితమే మీరిద్దరు కలిసి పనిచేయాలనుకుంటున్నారా ? ఎందుకు ఇన్ని సంవత్సరాలు పట్టిందని అడగ్గా.. జక్కన్న స్పందిస్తూ.. ‘ 2010లో నేను మహేష్ ఫస్ట్ టైమ్ కలుసుకున్నాం. అప్పుడే సినిమా చేద్దామని ఫిక్సయ్యాను. కాకపోతే నాకు ఉన్న కమిట్మెంట్స్ కారణంగా సినిమా చేయలేకపోయాను. ఆరు నెలల్లో ఈగ తీద్దామనుకుంటే రెండేళ్లు పట్టింది. తర్వాత రెండేళ్లలో బాహుబలి అనుకుంటే మూడేళ్లు పట్టింది.. కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ చాలా లేట్ అయ్యింది. అందుకే మహేష్ బాబుతో సినిమాకు చాలా ఆలస్యం అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి: Jabardasth: పెద్ద హీరో సినిమాలో ఛాన్స్.. మొహం మీదే వద్దని చెప్పా.. జబర్దస్త్ బ్యూటీ..

వారణాసి సినిమా దాదాపు 3 గంటల నిడివితోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఐదు నిమిషాలు సినిమా బోర్ కొడితే ప్రేక్షకుడు ఫోన్ చూసుకుంటాడు. అలా కాకుండా ఉండేందుకు ప్రేక్షకుడు సినిమా చూస్తూ ఉండిపోవడం అంటే పెద్ద సవాలే…రామాయణం ఓ భాగాన్ని వారణాసిలో చూపించే అవకాశం దొరికిందని రాజమౌళి చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న ఉగాది సందర్భంగా పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి: Dhandoraa Movie : దండోరా సినిమాలో బింధు మాధవి పాత్రలో ఆ హీరోయిన్ నటించాల్సింది.. కానీ.. డైరెక్టర్

Rajamouli, Mahesh Babu

Rajamouli, Mahesh Babu

ఎక్కువ మంది చదివినవి: Cinema : అర్థరాత్రి హోటల్లో అరుపులు.. 24 ఏళ్లుగా ఆ హీ‏రోయిన్‏ను భయపెడుతున్న సినిమా.. ఇప్పటికీ..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *