Deepika Padukone: దీపికాకు అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ నటిగా రికార్డ్..

Deepika Padukone: దీపికాకు అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన తొలి భారతీయ నటిగా రికార్డ్..


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణెకు పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. బెంగుళూరుకు చెందిన ఓ సాధారణ అమ్మాయి ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలో అడుగుపెట్టి తనదైన ముద్ర వేసింది. మొదట్లో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా.. ఫస్ట్ మూవీ ఏకంగా షారుఖ్ ఖాన్ సరసన కొట్టేసింది. ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన దీపికా తొలి సినిమాతోనే భారీ విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ తర్వాత స్టార్ హీరోలకు జోడిగా నటిస్తూ తనదైన ఇమేజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు బీటౌన్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో దీపికా ఒకరు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ అరుదైన గౌరవం అందుకుంది.

తాజాగా ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవంం దక్కింది. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు ఎంపికయ్యారు. ఈ మేరకు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ నటిగా దీపికా సరికొత్త రికార్డ్ సృష్టించారు. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తాజాగా వెల్లడించిన జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్ ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి హాలీవుడ్ స్టార్స్ తోపాటు దీపిక పేరు ఉండడం విశేషం.

దీంతో ఇప్పుడు దీపికాకు సినీప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు 35 మంది ప్రతిభావంతులు ఎంపిక చేసినట్లు ఛాంబర్ తెలిపింది. సినీరంగంలో అద్భుతమైన కృషి చేసిన వారిని ఎంపిక చేసినట్లు ఛాంబర్ వెల్లడించింది. దీపికాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలోనూ అనేక హాలీవుడ్ మ్యాగజైన్స్ విడుదల చేసిన విభిన్న జాబితాలలో చోటు దక్కించుకుంది. ఇక దీపికా చివరిసారిగా ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రంలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *