Dates vs Almonds: ఖర్జూరం.. బాదం.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది? నిపుణుల సలహా ఇదే..

Dates vs Almonds: ఖర్జూరం.. బాదం.. ఏది ఆరోగ్యానికి మేలు చేస్తుంది? నిపుణుల సలహా ఇదే..


శీతాకాలంలో శరీర రోగనిరోధక శక్తి బలహీనపడటం సర్వసాధారణం. ఫలితంగా శరీరం కాలానుగుణ వ్యాధులకు ఎక్కువగా గురవుతుంది. అందువల్ల ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తిని పెంచే, శరీరాన్ని లోపల నుంచి వెచ్చగా ఉంచే ఆహారాలను తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఆరోగ్య నిపుణులు ఖర్జూరం, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. రెండూ ఆరోగ్యకరమైనవి. కానీ వాటి ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి రెండింటిలో ఏది మంచిది? వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అనే విషయాలు ఈ కింద తెలుసుకోండి..

శీతాకాలంలో ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఖర్జూరాలలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. ఉదయం 2 నుంచి 3 ఖర్జూరాలు తినడం వల్ల అలసట తగ్గుతుంది. అంతే కాదు ఖర్జూరాలలో ఇనుము అధికంగా ఉంటుంది. శీతాకాలంలో వచ్చే బలహీనత, హిమోగ్లోబిన్ లోపాన్ని నివారిస్తుంది. వాటిలోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఇది కాకుండా ఖర్జూరాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కానీ ఈ ప్రయోజనాలను మితంగా తీసుకోవడం ద్వారా పొందవచ్చు.

బాదం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

బాదం శరీరానికి తక్షణ శక్తిని అందించదు. కానీ అవి ఎక్కువ కాలం పాటు స్థిరమైన శక్తిని అందించడంలో సహాయపడతాయి. వాటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ శీతాకాలంలో శరీరాన్ని బలంగా, వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. బాదంలో విటమిన్ E పుష్కలంగా ఉంటుంది. ఇది చలి కాలంలో పొడి చర్మాన్ని వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అంతే కాదు బాదం మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఖర్జూరం, బాదం.. శీతాకాలానికి ఏది మంచిది?

శీతాకాలంలో ఖర్జూరాలు, బాదం రెండూ ఆరోగ్యకరమైనవి. ఖర్జూరాలు జలుబు, అలసటతో ఉన్నవారికి మంచివి. ఎందుకంటే అవి తక్షణ శక్తిని అందిస్తాయి. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి. కానీ దీర్ఘకాలిక శక్తి, రోగనిరోధక శక్తి మొత్తం ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరంగా ఉండేదుకు బాదం తినడం మంచిది. అయితే రెండింటినీ ఆహారంలో చేర్చుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉదయం 10-12 నానబెట్టిన బాదం తినడం జీవనశైలిలో అలవాటు చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *