ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కుక్కల్లో మొదటి ప్లేస్‌లో ఉన్నది అమెరికన్ పిట్ బుల్ టెర్రియర్. ఇది చూడ్డానికి కూడా భలమైన కండరాలు, శక్తివంతమైన దవడలు, పదునైన పళ్లతో భయంకరంగా కనిపిస్తుంది.
ప్రమాదకరమైన కుక్కలలో రెండో ప్లేస్‌లో ఉన్న రోట్వీలర్ డాగ్. వీటిని ఎక్కువగా ఇంటి దగ్గర సెక్యూరిటీ కోసం వాడుతుంటారు. రోట్వీలర్ గాడ్స్ బలీయమైన కాపలా కుక్కలు అయినప్పటికీ, ఇది తెలియని వారి పట్ల క్రూరంగా ప్రవర్తిస్థాయి. ఇంట్లోకి ఎవరైనా తెలియని వారు వస్తే ఇట్టే వారిపై దూసుకెళ్తాయి.
మూడో ప్లేస్‌లో ఉన్న జర్మన్ షెపర్డ్, దీన్ని సాధారణంగా మనం అందరం చూసే ఉంటాం. అత్యంత తెలివైన, శక్తివంతమైన కుక్కల్లో ఈ జర్మన్ షెపర్డ్‌లు లాప్‌లో ఉంటాయి. వీటిని పోలీసులు, సైనికు దొంగలను పట్టుకునేందుకు, ప్రమాదాలను గుర్తించేందుకు ఉపయోగిస్తుంటారు. అయితే ఇవి నమ్మకమైనవి అయినప్పటికీ వాటిని సరిగ్గా ట్రైన్ చేయకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇక నాలుగో ప్లేస్‌లో ఉన్న డోబెర్మాన్ పిన్షర్, దీని కూడా చాలా మంది చూసి ఉంటారు. ఈ జాతి పెట్‌ను కూడా కాపలా, రక్షణ కోసం ఎక్కువగా పెంచుకుంటారు. డోబెర్మాన్ పిన్షర్లు వాటి తెలివితేటలు, అథ్లెటిసిజం, విధేయతకు ప్రసిద్ధి చెందినవి. అయినప్పటికీ, ఇవి అపరిచితుల పట్ల దూకుడుగా ప్రవర్తిస్థాయి.
ఇక ఐదో ప్లేస్‌లో ఉన్నది బుల్మాస్టిఫ్ డాగ్. వీటి ఆకారం, భారీ పరిమాణం, శక్తివంతమైన శరీర నిర్మాణంతో చూడ్డానికి భయంకరంగా ఉంటాయి.ఈ బుల్మాస్టిఫ్లు సహజంగానే తమ కుటుంబాన్ని రక్షిస్తాయి. అవి చూడ్డానికి భయంకరంగా ఉన్నప్పటికి కొన్ని సార్లు చాలా సున్నితంగా ఉంటాయి. అయితే దొంగల పట్ల చాలా దూకుడుగా ప్రవర్తిస్థాయి.