Dangerous Body Pains: శరీరంలో ఈ చోట్ల నొప్పి వస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు..! క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు జాగ్రత్త..!

Dangerous Body Pains: శరీరంలో ఈ చోట్ల నొప్పి వస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు..! క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు జాగ్రత్త..!


మన శరీరంలో కొన్నిసార్లు నొప్పులు వస్తూ ఉంటాయి.. వెళ్తూ ఉంటాయి. కానీ కొన్ని నొప్పులు మాత్రం మనం మామూలుగా తీసుకుంటే కుదరదు. అవి పదే పదే వస్తూ మామూలు మందులకు కూడా తగ్గకపోతే.. అది క్యాన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులకు సంకేతం కావచ్చు. ఇలాంటి నొప్పులను మనం అస్సలు లైట్ తీసుకోకూడదు. వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.

వెన్నునొప్పి

చాలా మందికి వెన్నునొప్పి సర్వసాధారణం. కానీ ఈ నొప్పి తీవ్రంగా ఉండి ఎంత విశ్రాంతి తీసుకున్నా తగ్గకపోతే ఇది ప్రమాదానికి గుర్తు కావచ్చు. ముఖ్యంగా నొప్పి పైభాగం నుంచి కింది భాగానికి పాకితే అది ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ లేదా కిడ్నీ క్యాన్సర్‌ లకు సంకేతం కావచ్చు. రాత్రిపూట నొప్పి ఎక్కువవడం, ఆకలి తగ్గడం, బరువు కోల్పోవడం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి.

కడుపు నొప్పి

సాధారణంగా గ్యాస్ లేదా అసిడిటీ వల్ల కడుపు నొప్పి వస్తుంది. కానీ నొప్పి రోజు రోజుకు ఎక్కువైతే అది గర్భాశయం, కాలేయం లేదా పేగుల క్యాన్సర్‌ కు గుర్తుగా ఉండొచ్చు. ఈ లక్షణాలతో పాటు తినే అలవాట్లు మారినా.. మలంలో రక్తం కనిపించినా, మంటగా అనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

తలనొప్పి

సాధారణ తలనొప్పిని మనం పెద్దగా పట్టించుకోం. కానీ కొత్తగా వచ్చే తలనొప్పి మందులకు కూడా తగ్గకపోతే అది మెదడు కణితికి లేదా మెదడులోకి వ్యాపించిన క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. రొమ్ము లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ మెదడుకు వ్యాపించినప్పుడు ఇలాంటి తలనొప్పి వస్తుంది. దృష్టి మసకబారడం, జ్ఞాపకశక్తి తగ్గడం లేదా ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి.

ఎముకలు, కీళ్ల నొప్పులు

వయసు పెరిగే కొద్దీ ఎముకలు, కీళ్ల నొప్పులు రావడం సహజం. కానీ ఒకే చోట నిరంతరం నొప్పి ఉంటే.. అది ఎముకల క్యాన్సర్ లేదా లుకేమియా లక్షణం కావచ్చు. ఈ నొప్పులతో పాటు అలసట, జ్వరం, బరువు తగ్గడం వంటివి ఉంటే.. పూర్తి స్కానింగ్ చేయించుకోవడం అవసరం.

ఛాతీ నొప్పి

ఛాతీ నొప్పి గుండె సమస్యల వల్ల రావచ్చు. కానీ గుండె సమస్యలు లేకపోయినా నొప్పి కొనసాగితే అది ఊపిరితిత్తులు లేదా అన్నవాహిక క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. అదే సమయంలో దగ్గు, మింగడంలో ఇబ్బంది లేదా రక్తపు వాంతులు ఉంటే.. వెంటనే డాక్టర్‌ను కలవాలి.

నొప్పిని ఎలా అర్థం చేసుకోవాలి..?

  • ప్రతి నొప్పి క్యాన్సర్‌కు గుర్తు కాదు.. కానీ కొన్ని సందర్భాల్లో జాగ్రత్త చాలా అవసరం.
  • నొప్పి మందులకు తగ్గకపోతే.. ఎక్కువ కాలం కొనసాగితే నిర్లక్ష్యం చేయవద్దు.
  • నొప్పి, అలసట, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటివి ఒకేసారి కనిపిస్తే వెంటనే డాక్టర్ సలహా తీసుకోండి.
  • జబ్బును మొదట్లోనే గుర్తిస్తే చికిత్స సులభంగా ఉంటుంది.

మన ఆరోగ్యంపై మనం ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. అందుకే సంవత్సరానికోసారి ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవడం చాలా మంచిది. ఈ సమాచారం మీకు ఒక ఐడియా ఇవ్వడానికి మాత్రమే. ఏ మాత్రం డౌట్ వచ్చినా లేదా ఏదైనా హెల్త్ ఇష్యూ అనిపిస్తే.. వెంటనే ఒక స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలవండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *