మేడ్చల్ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహ సమీపంలో ఉన్న ప్రధాన కూడలి వద్ద మాజీ ఎంపీటీసీ మురళి ఇంటిలో సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఒకరు మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు అందించిన సమాచారం ప్రకారం, మురళి ఇంటి కింద భాగంలో పూల దుకాణం ఉంది. ఈ దుకాణంలోనే సిలిండర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే స్థానికులు మరియు పోలీసులు సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఒకరు చనిపోగా మరొక మహిళ చికిత్స పొందుతోంది
సిలిండర్ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల పేలుడు జరిగిందా, లేక గ్యాస్ లీకేజీ వల్ల జరిగిందా అనేది పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.