Cyber Security: అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌.. ఎంత డేంజరో తెలుసా? వెంటనే మార్చేయండి

Cyber Security: అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌.. ఎంత డేంజరో తెలుసా? వెంటనే మార్చేయండి


Cyber Security: అన్ని అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌.. ఎంత డేంజరో తెలుసా? వెంటనే మార్చేయండి

కొంతమంది తమ సోషల్ మీడియా ఖాతాలకు వేర్వేరు పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటారు. అయితే మరికొందరు ప్రతి అకౌంట్‌కు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తారు. సోషల్ మీడియా, బ్యాంకు, ఈమెయిల్ వంటి బహుళ అకౌంట్‌లకు పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది. కానీ ఈ సౌలభ్యం లేనిపోని సమస్యలను సృష్టిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ దోస్త్ (హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద) మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ Xలో తాజాగా ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో వేర్వేరు ఖాతాలకు ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం వల్ల సైబర్‌ క్రైం సమస్య పెరుగుతుందని పేర్కొంది. ఎందుకంటే ఒక్కసారి డేటా ఉల్లంఘన జరిగితే మీ అన్ని ఖాతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

సింపుల్‌గా చెప్పాలంటే సైబర్ దోస్త్ పోస్ట్‌లో చెప్పిందేమంటే.. డేటా లీక్ కారణంగా హ్యాకర్లు మీ ఇతర ఖాతాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇది మీ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. డేటా లీక్ వల్ల హ్యాకర్లు మీ వ్యక్తిగత వివరాలను కూడా యాక్సెస్ చేయవచ్చు.

మీ డేటా లీక్ అయిందా? లేదా..? అనేది ఈ విధంగా తనిఖీ చేయండి

ముందుగా మీరు haveibeenpwned.com అనే వెబ్‌సైట్‌కు వెళ్లి మీ ఈమెయిల్ చిరునామాను నమోదు చేసి తనిఖీ చేసుకోవాలి. మీ ఈమెయిల్ చిరునామా డేటా ఉల్లంఘనలో ఉపయోగించబడిందో లేదో ఈ సైట్ మీకు వెంటనే తెలియజేస్తుంది. ఇందులో డేటా ఉల్లంఘన అయినట్లు వెల్లడిస్తే, వెంటనే అన్ని ఖాతాలకు పాస్‌వర్డ్‌లను మార్చండి. ఎవరూ క్రాక్ చేయలేని అత్యంత కష్టతరమైన కొత్త పాస్‌వర్డ్‌ను సృష్టించాలి. అంటే బలమైన పాస్‌వర్డ్‌ను సృష్టించడానికి మీ పాస్‌వర్డ్‌లో పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు, చిహ్నాలు, సంఖ్యల మిశ్రమం ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి.

మీ బ్యాంకు ఖాతా వంటి ఇతర అకౌంట్లను హ్యాకర్ల నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఖాతాకు భిన్నమైన, బలమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం మర్చిపోకూడదు.

గమనిక: పాస్‌వర్డ్ ఎట్టి పరిస్థితుల్లోనూ 12345678 వంటి బలహీనమైన అంకెలతో పాస్‌వర్డ్‌లు సృష్టించకూడు. ఇటువంటి సాధారణ పాస్‌వర్డ్‌లను ఎప్పుడూ ఉపయోగించవద్దు. అలా చేయడం వల్ల హ్యాకర్ల పని మరింత సులువు అవుతుంది. మీ సమస్యలు మరింత పెరిగి చిక్కుల్లో పడతారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *