Cryonics: మీరు చచ్చినా.. మేం చావనివ్వం..! మళ్ళీ బ్రతికిస్తాం.. కానీ..

Cryonics: మీరు చచ్చినా.. మేం చావనివ్వం..! మళ్ళీ బ్రతికిస్తాం.. కానీ..


తాజాగా ఐరోపాలోని మొదటి క్రయోనిక్స్ ల్యాబ్‌ రూ. 1.74 కోట్లకు శవాలను భద్రపరుస్తామని ప్రకటించింది. కాగా, జర్మనీలోని టుమారో బయో సంస్థ గతంలో ఇచ్చిన ఇలాంటి ఆఫర్‌కు స్పందించి ఇప్పటికే 650 మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. సృష్టిలో కొన్ని జీవులు అతి శీతల వాతావరణంలోనూ జీవించడానికి వీలుగా.. సహజంగానే తమ శరీరంలో రసాయన మార్పులు జరగకుండా స్తంభింపచేసి.. కొన్ని నెలలు లేదా సంవత్సరాలు జీవిస్తున్నాయి. తర్వాత జీవించడానికి అనువైన పరిస్థితులు వచ్చినపుడు వాటి శరీరంలో తిరిగి రసాయన మార్పులు మొదలవుతాయి. ధృవ ప్రాంతాల్లో కప్పలు, మొసళ్ళు, తొండలు, చేపలు ఇలాగే జీవిస్తాయి. వీటపై శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నారు. ఆ జీవుల్లో స్వతహాగా సాధ్యం అవుతున్న జీవ స్తంభన ప్రక్రియలు.. మనిషి విషయంలో ఎందుకు సాధ్యం కాదనే కోణంలో ఈ పరిశోధన జరిగింది. దాని నుంచే క్రయోనిక్స్ విధానం పుట్టుకొచ్చింది. అమెరికా, రష్యాలో 50 ఏళ్ల క్రితమే క్రయోనిక్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. జంతువుల కళేబరాలనూ అక్కడ భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు 1353 మృత శరీరాల్ని భద్రపరిచారు. ఇంకా అనేక వేల మంది తమ శరీరాలను భవిష్యత్ లో తిరిగి జీవించే ఆశతో నిల్వ చేసుకోవడానికి రిజిస్టర్ చేసుకున్నారు. ఈ విధానంలో.. మనిషి చనిపోయాడని చట్టబద్ధంగా నిర్ధారించిన మరుక్షణమే శవం నుంచి రక్తాన్ని, ఇతర ద్రవ పదార్థాలను తొలగించి, రసాయనాలతో నింపుతారు. పెద్ద స్టీల్‌ ట్యాంకుల్లో ద్రవరూప నైట్రోజన్‌ను నింపి అందులో శరీరాన్ని భద్రపరుస్తారు. ఈ ట్యాంకుల్లో అతి శీతల ఉష్ణోగ్రత ఉంటుంది. దీనివల్ల శరీర కణజాలాలు, ఇతర అవయవాలు పాడవకుండా ఉంటాయి. ఈ ప్రక్రియనే క్రయోనిక్స్‌ అంటారు. గుండె కొట్టుకోవటం ఆగగానే చనిపోయారనటం సరికాదని, శరీరంలోని కణజాలాలు, కండరాలు, అవయవాలు అచేతనంగా మారటానికి చాలా టైం పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవి పూర్తిగా అచేతనంగా మారకముందే గడ్డకట్టిస్తామని తెలిపారు. అయితే, పునర్జన్మ మీద మాత్రం ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే శరీరాన్ని భద్రపర్చగలమని, గుండెను పనిచేయించే టెక్నాలజీ మాత్రం లేదని అంటున్నారు. భవిష్యత్తులో కొత్త టెక్నాలజీ వస్తే.. ఆగిన గుండెను తిరిగి కొట్టుకొనేలా చేయగలుగుతామని అంటున్నారు. అయితే క్రయోనిక్స్ విధానాన్ని సమర్థించేవారిలో చాలా మంది…మరణాన్ని జయించే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో కచ్చితంగా చెప్పలేమంటున్నారు. అసలు సాధ్యం అవుతుందో లేదో కూడా తెలీదంటున్నారు. విట్రిఫికేషన్ విధానంలో కంటెయినర్లలో భద్రపరిచిన శరీరాలు నిజంగా పాడవకుండా ఉన్నాయో లేదో కూడా తెలీదంటున్నారు. అయితే మరికొందరు ఇలా మెదడును లేదా శరీరాన్ని భద్రపరిచే క్రయోనిక్స్ సాంకేతిక పరిజ్ఞానం విఫలమవుతుందని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇక.. 2 గంటల్లోనే హైదరాబాద్‌ టు విజయవాడ

ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు.. 84 % మందికి ఆ డిసీజ్

పెళ్లి ద్వారా గ్రీన్ కార్డ్ పొందటం.. ఇక ఈజీ కాదు

గుడ్ న్యూస్.. రాత పరీక్ష లేకుండా 3115 రైల్వే ఉద్యోగాల భర్తీ

‘దేవుడి దగ్గరికి వెళ్తున్నా..’ ఐదో అంతస్తు నుంచి దూకిన మహిళ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *