Cristiano Ronaldo : చెలరేగిపోయిన క్రిస్టియానో రొనాల్డో.. హ్యాట్రిక్ గోల్స్‌.. 4-0తో అల్-నాసర్ ఘన విజయం

Cristiano Ronaldo : చెలరేగిపోయిన క్రిస్టియానో రొనాల్డో.. హ్యాట్రిక్ గోల్స్‌.. 4-0తో అల్-నాసర్ ఘన విజయం


Cristiano Ronaldo : ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి తన సత్తా చాటాడు. అల్ నాసర్ క్లబ్ కోసం ప్రి-సీజన్ మ్యాచ్‌లో అతను అద్భుతమైన ప్రదర్శనతో హాట్రిక్ గోల్స్ సాధించాడు. ఈ గోల్స్‌తో అల్ నాసర్, రియో ఏవ్‌పై 4-0తో భారీ విజయం సాధించింది. ఇటీవల క్లబ్ మార్పుపై వచ్చిన పుకార్లకు చెక్ పెడుతూ రొనాల్డో తన కాంట్రాక్ట్‌ను పొడిగించుకున్న తర్వాత ఈ ప్రదర్శన ఇవ్వడం విశేషం. అల్ నాసర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో, పోర్చుగల్‌లో జరిగిన ప్రి-సీజన్ మ్యాచ్‌లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. రియో ఏవ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను మూడు గోల్స్ చేసి జట్టుకు 4-0తో విజయాన్ని అందించాడు.

మ్యాచ్ ప్రారంభమైన 15వ నిమిషంలో మొహమ్మద్ సిమాకాన్ తొలి గోల్ సాధించి అల్ నాసర్‌కు ఆధిక్యం అందించాడు. తొలి అర్ధభాగానికి ముందు రొనాల్డో, కొత్తగా జట్టులో చేరిన జోవో ఫెలిక్స్‌తో కలిసి తొలి గోల్ సాధించాడు. రెండో అర్ధభాగంలో సాడియో మానేకు లభించిన పెనాల్టీ కిక్‌ను మిస్సయ్యాడు. కానీ కేవలం 16 సెకన్ల తర్వాత రొనాల్డో అద్భుతమైన హెడర్‌తో మరో గోల్ చేసి, జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. ఆ తర్వాత ఐదు నిమిషాలకు, జోవో ఫెలిక్స్‌పై ప్రత్యర్థి ఆటగాడు నెల్సన్ అబ్బే ఫౌల్ చేయడంతో అల్ నాసర్‌కు మరో పెనాల్టీ లభించింది. ఈసారి రొనాల్డో స్వయంగా పెనాల్టీ కిక్‌ను తీసుకుని గోల్ చేసి, తన హాట్రిక్‌ను పూర్తి చేసుకున్నాడు.

ఇటీవల అల్ నాసర్ ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోవడంతో రొనాల్డో క్లబ్ ను వీడుతాడని పుకార్లు వచ్చాయి. అయితే, రొనాల్డో ఈ పుకార్లకు చెక్ పెడుతూ క్లబ్‌తో 2027 వరకు కొత్త కాంట్రాక్ట్ పై సంతకం చేశాడు. ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ, “కొత్త అధ్యాయం మొదలవుతుంది. అదే ఉత్సాహం, అదే కల. కలిసి చరిత్ర సృష్టిద్దాం” అని రొనాల్డో పేర్కొన్నాడు.

2022లో మాంచెస్టర్ యునైటెడ్‌ను వీడిన తర్వాత అల్ నాసర్‌లో చేరిన రొనాల్డో, అప్పటి నుంచి అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు 105 మ్యాచ్‌లలో 93 గోల్స్ సాధించాడు. అతని రాక సౌదీ ప్రో లీగ్‌కు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించి, ఇతర స్టార్ ప్లేయర్స్ సౌదీకి రావడానికి మార్గం సుగమం చేసింది. అల్ నాసర్ తదుపరి ప్రి-సీజన్ మ్యాచ్ ఆగస్టు 10న యు.డి. అల్మేరియాతో ఆడనుంది. అలాగే, సౌదీ సూపర్ కప్ సెమీ-ఫైనల్‌లో ఆగస్టు 19న అల్ ఇత్తిహాద్‌తో తలపడనుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *