Cricket: టీ20ల్లో ఒక్క సిక్స్ కొట్టిన వరస్ట్ బ్యాటర్లు వీరే.. లిస్టులో ధోని టీమ్‌మేట్.. ఎవరంటే.?

Cricket: టీ20ల్లో ఒక్క సిక్స్ కొట్టిన వరస్ట్ బ్యాటర్లు వీరే.. లిస్టులో ధోని టీమ్‌మేట్.. ఎవరంటే.?


టీ20 ఫార్మటు అంటేనే డైనమెట్.. టెస్టులు, వన్డేలు అటుంచితే.. ఈ పొట్టి ఫార్మటులో ఫస్ట్ బంతి నుంచే బ్యాటర్లు విరుచుకుపడతారు. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్ల ఊచకోత కోస్తారు. మరి అలాంటి ఈ పొట్టి క్రికెట్‌లో విసుగుతెప్పించే బ్యాటర్లు కొందరు ఉన్నారు. టీ20 లీగ్ అంటేనే గుర్తొచ్చేది సిక్సర్ల హోరు.. ఫోర్ల జోరు.. ఆకాశమే హద్దుగా బ్యాటర్లు చెలరేగిపోతే.. ఫ్యాన్స్ కేరింతలు కొడుతుంటారు. కానీ ఈ బ్యాటర్లు టీ20 క్రికెట్‌లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేదు. ఆ లిస్టులో ఎనిమిది మంది ఆటగాళ్లు ఉన్నారు.. కానీ మనం ఒక ఐదుగురి గురించి మాట్లాడుకుందాం. అందులో ధోని టీమ్ మేట్ ఒకరు..

ఆ లిస్టు ఇదే..

అంబటి రాయుడు: ఈ మాజీ చెన్నై ప్లేయర్ కేవలం 6 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో 42 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 4 ఫోర్లు ఉన్నప్పటికీ.. ఒక్క సిక్స్ లేకపోవడం గమనార్హం.

ఆండ్రీ స్ట్రాస్: ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఆండ్రీ స్ట్రాస్ కేవలం 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ నాలుగింటిలో 18.25 యావరేజ్‌తో 73 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు మాత్రమే ఉన్నాయి. ఒక్క సిక్స్ కూడా లేదు.

మైకేల్ వాన్: ఈ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ వన్డేలు, టెస్టులకు పెట్టింది పేరు. కానీ ఇతడు టీ20ల్లో ఆడింది మాత్రం కేవలం రెండు మ్యాచ్‌లు. అందులో 13.50 సగటుతో కేవలం 27 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు ఉండగా.. ఒక్క సిక్స్ లేదు.

ఇమామ్ ఉల్ హక్: ఈ పాకిస్తాన్ ఓపెనర్ ఎక్కువగా వన్డేలు ఆడాడు. వన్డేల్లో ఈ ప్లేయర్ పేరు మీద సిక్సర్లు ఉన్నప్పటికీ.. టీ20ల్లో మాత్రం ఒక్క సిక్స్ లేదు. మనోడి ఫామ్ లేమి కారణంగా పాకిస్తాన్ ఎక్కువగా ఈ ప్లేయర్‌ను టీ20ల్లో ఆడించలేదు.

స్టీఫెన్ ఫ్లెమింగ్: ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న స్టీఫెన్ ఫ్లెమింగ్.. కివిస్ జట్టు తరపున వన్డేలు, టెస్టులకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ.. టీ20లు మాత్రమే 5 మ్యాచ్‌లే ఆడాడు. 20 ఫోర్లతో 110 పరుగులు మాత్రమే చేశాడు.

ఇది చదవండి: ఎవర్రా సచిన్.! 140 సెంచరీలు, 36 వేలకుపైగా పరుగులు.. ఈ తోపు బ్యాటర్ బరిలోకి దిగితే బౌలర్లకు వణుకే.. 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *