Credit Cards: ఫ్రీగా క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్న బ్యాంకులు.. లిస్ట్‌లో టాప్ బ్యాంకులు

Credit Cards: ఫ్రీగా క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్న బ్యాంకులు.. లిస్ట్‌లో టాప్ బ్యాంకులు


బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. అయితే వాటిని నిర్వహించడం మాత్రం చాలా కష్టం. చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డులపై హిడెన్ చార్జీలతో వినియోగదారులపై భారాన్ని వేస్తాయి. చాలా వరకు బ్యాాంకులు క్రెడిట్ కార్డుల వినియోగంపై వార్షిక రుసుము విధిస్తాయి. దాంతో ఆగకుండా ఇతర చార్జీలను కూడా వసూలు చేస్తాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని బ్యాంకులు ఎలాంటి చార్జీలు లేకుండా క్రెడిట్ కార్డులను రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా వార్షిక రుసుము కూడా మాఫీ చేస్తూ కార్డులను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఉచితంగా క్రెడిట్ కార్డులను మంజూరు చేసే టాప్ బ్యాంకులను ఓ సారి తెలుసుకుందాం. 

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ క్లాసిక్ క్రెడిట్ కార్డ్

ఈ కార్డుకు వార్షిక లేదా జాయినింగ్ ఫీజు లేదు, వెలకమ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. కొత్త వినియోగదారులు తమ మొదటి ఈఎంఐ లావాదేవీపై రూ. 500 గిఫ్ట్ వోచర్‌ను ఆశ్వాదించవచ్చు. అలాగే రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే సినిమా టిక్కెట్లపై 25 శాతం తగ్గింపు, 1 శాతం ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు, 300 కంటే ఎక్కువ భాగస్వామి వ్యాపారుల వద్ద ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.

అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్

ఈ కార్డుకు కూడా ఎలాంటి వార్షిక రుసుములు లేవు. అలాగే రివార్డ్ పాయింట్లపై ఎలాంటి గడువు ఉండకపోవడం ఈ కార్డు ప్రత్యేకత. ఈ కార్డు ద్వారా అమెజాన్ ప్రైమ్ సభ్యులు అమెజాన్‌లో చేసే కొనుగోళ్లపై 5 శాతం, ప్రైమ్ కాని వినియోగదారులకు 3 శాతం, ఇతర అన్ని ఖర్చులపై 1 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. అలాగే ఈ కార్డుపై ఇంధన సర్‌ఛార్జ్ మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. కాబట్టి రోజువారీ ఖర్చులకు ఈ కార్డు సరిగ్గా సరిపోతుంది. 

ఇవి కూడా చదవండి

బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రైమ్ క్రెడిట్ కార్డ్

ఈ కార్డ్ కొత్తగా క్రెడిట్ పొందిన లేదా ఆదాయ రుజువు లేని వ్యక్తులకు సరైన ఎంపిక. ఎందుకంటే ఇది రూ. 15,000 లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై జారీ చేస్తారు. ఈ కార్డుకు కూడా ఎలాంటి వార్షిక రుసుము లేదు. అలాగే ఈ కార్డు వినియోగదారులు మొదటి 60 రోజుల్లో రూ. 5,000 ఖర్చు చేయడం చేస్తే 500 బోనస్ రివార్డ్ పాయింట్లను అందిస్తున్నారు. అలాగే కొనుగోళ్లపై ఖర్చు చేసే ప్రతి రూ. 100 కు 2 రివార్డ్ పాయింట్లను కూడా అందిస్తున్నారు. రూ. 2,500 కంటే ఎక్కువ కొనుగోళ్లను 6 నుండి 48 నెలల వరకు సులభమైన ఈఎంఐలుగా మార్చుకునే సౌలభ్యం కూడా అందుబాటులో ఉంది. 

యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డ్

ఈ కార్డు మంజూరు చేసిన మొదటి సంవత్సరం ఎలాంటి రుసుము ఉండవు. కానీ రెండో సంవత్సరం నుంచి నామమాత్రపు రుసుము రూ.250 వసూలు చేస్తారు. వినియోగదారులు ఫుడ్ డెలివరీపై రూ.120 తగ్గింపు, పేటీఎం ద్వారా రీఛార్జ్‌లు, డీటీహెచ్ చెల్లింపులపై 5 శాతం తగ్గింపు, ఎంపిక చేసిన రెస్టారెంట్లలో 15 శాతం వరకు తగ్గింపును పొందుతారు. అలాగే రూ.2,500 కంటే ఎక్కువ బిల్లులపై గరిష్ట డిస్కౌంట్ రూ.500 అందిస్తారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *