
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న కూలీ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, కన్నడ నటుడు ఉపేంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.కూలీ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. విడుదల దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా కూలి మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేసింది. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మేకర్స్.