Coolie Movie: కూలీ నెం 1421.. రజనీ చేతిలో కనిపించే ఈ బ్యాడ్జీ నంబర్‌ వెనక ఒక ఎమోషనల్ స్టోరీ ఉందని తెలుసా?

Coolie Movie: కూలీ నెం 1421.. రజనీ చేతిలో కనిపించే ఈ బ్యాడ్జీ నంబర్‌ వెనక ఒక ఎమోషనల్ స్టోరీ ఉందని తెలుసా?


సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా కూలీ. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రజనీతో పాటు ఆమిర్ లతో పాటు అక్కినేని నాగార్జున, శ్రుతి హాసన్, ఉపేంద్ర, రచితా రామ్, పూజా హెగ్డే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే కూలీ మూవీ నుంచి రిలీజైన ట్రైలర్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అంతకు ముందు రిలీజైన గ్లింప్స్, పోస్టర్లు కూడా సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే కూలీ సినిమా రిలీజైనప్పుడు రజనీకాంత్ చేతిలో 1421 అనే కూలీ బ్యాడ్జి నంబర్ కనిపించింది. అయితే పర్టిక్యులర్ గా ఇదే నంబర్ పెట్టడం వెనక ఒక హార్ట్ టచింగ్ అండ్ ఎమోషనల్ స్టోరీ దాగి ఉంది.

శనివారం (ఆగస్టు 2న) చెన్నైలో కూలీ 2025 సినిమా ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. రజనీతో పాటు స్టార్ యాక్టర్లందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదే సందర్భంగా లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ, ఈ సినిమాలో రజనీకాంత్ కూలీ బ్యాడ్జ్ నంబర్ 1421 అని పెట్టడానికి ఒక ప్రత్యేక కారణం ఉందన్నాడు. అదేంటంటే.. లోకేష్ తండ్రి ఒక సాధారణ బస్ కండక్టర్. ఆయన కూలీ బ్యాడ్జ్ నంబర్ 1421. తన తండ్రికి గుర్తు గా ఇప్పుడు ఆ బ్యాడ్జి నంబర్‌ను రజనీ సర్ కూలీ బ్యాడ్జ్ నంబర్‌గా అంకితం ఇచ్చానని లోకేష్ కనగరాజ్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

“ఇది మానాన్న బ్యాడ్జ్ నంబర్. ఆయనొక బస్ కండక్టర్ అని రజనీ సార్ కు చెప్పినప్పుడు ‘మీ తండ్రి కండక్టర్ అని మీరు నాకు ఎందుకు చెప్పలేదు?’ అని అడిగారు. నా తండ్రి రజనీకాంత్ గురించి తాను చెప్పదల్చుకోలేదని, ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాలని, రజనీ సార్ అడిగి నప్పుడు చెబితే అప్పుడు అది మరింత గుర్తుండిపోతుందని నాకు తెలుసు’ అని లోకేష్ చెప్పుకొచ్చారు.

కూలీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో డైరెక్టర్ లోకేశ్ ఎంట్రీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *