Commodity Prices: సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. ఒకేసారి పెరిగిన వంటనూనె, పప్పుల ధరలు.. ఎంతంటే..?

Commodity Prices: సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. ఒకేసారి పెరిగిన వంటనూనె, పప్పుల ధరలు.. ఎంతంటే..?


సామాన్యులకు షాక్ తగిలింది. ఇంట్లోకి అవసరమయ్యే నిత్యావసర వస్తువుల ధరలు క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. వంటింట్లోకి అవసరమయ్యే సరుకుల ధరలు అనూహ్య రీతిలో పెరుగుతూ వస్తోన్నాయి. దీంతో సామాన్యులపై అధిక భారం పడుతుండటంతో ఇంటి ఖర్చు పెరుగుతున్నాయి. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవారికి ఇది బ్యాడ్‌న్యూస్‌గానే చెప్పవచ్చు. తాజాగా వంటనూనె, పప్పుల ధరలు ఆమాతం పెరుగుదలను నమోదు చేశాయి. నెల రోజుల్లో లీటర్‌కు 50 రూపాయల మేర పెరిగింది. ధరలు పెరగడంతో నూనె తయారీ కంపెనీలు ప్యాకెట్ల సైజులో మార్పులు చేస్తున్నాయి.

వంట నూనె ధరలు ఇలా..

-ప్రస్తుతం లీటర్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర రూ. 167 వద్ద కొనసాగుతోంది. జనవరి ప్రారంభంలో ఈ ధర రూ.150గా ఉంది

-ఇక వేరుశెనగ నూనె ప్రస్తుతం రూ.180గా ఉంది. గత నెలలో రూ.160కే లభించింది. దీనిపై రూ.20 పెరిగింది

-ఇక పామాయిల్ 850 గ్రాముల ప్యాకెట్ ధర ఇప్పుడు మార్కెట్లో రూ.120 వద్ద కొనసాగుతోంది. గత నెలలో రూ.110గా ఉండేది

-కంపెనీలను బట్టి నూనె ధరల్లో మార్పులు ఉంటాయి

-ధరలు పెరుగుతుండంతో కంపెనీలు ప్యాకెట్ల సైజును తగ్గించి విక్రయిస్తున్నాయి

-లీటర్ ప్యాకెట్‌కు బదులు 910,850,800 గ్రాముల ప్యాకెట్లను విక్రయిస్తున్నాయి

పెరిగిన పప్పుల ధరలు

-కేజీ కంది పప్పు ప్రస్తుతం మార్కెట్లో రూ.130 పలుకుతోంది. గత నెలలో రూ.110కే దొరికింది

-మినపప్పు ధరలు రూ.20 మేర పెరిగాయి

-వేరుశనగ పలుకులు వారం రోజుల క్రితం కేజీ రూ.140కి లభించగా.. ఇప్పుడు రూ.200 పలుకుతున్నాయి.

-ఇక ఎండుమిర్చి వారం రోజుల క్రితం కిలో రూ.240కి దొరకగా.. ఇప్పుడు రూ.300కి పెరిగింది.

-ఇంట్లోకి రోజు అవసరమయ్యే వంటనూనె, పప్పుల ధరలు పెరగడంతో సామాన్యులు షాక్ అవుతున్నాయి.

-ప్రస్తుతం పండుగల సీన్ లేనప్పటికీ.. ధరలు పెరుగడం గమనార్హం

కూరగాయల ధరలు..

ఇక హైదరాబాద్‌లోని పటాన్‌చెర్వు మార్కెట్ యార్డులో కేజీ టమాట రూ.20, బీర రూ.50, బెండకాయ రూ.30, వంకాయ రూ.20, క్యాలీఫ్లవర్ రూ.30, క్యారెట్ రూ.30, దొండకాయ రూ.60, బీన్స్ రూ.30గా ఉన్నాయి. ఇక కిలో మిర్చి రూ.60, ఉల్లిపాయ రూ.30, సొరకాయ రూ.20, బీట్ రూట్ రూ.30, క్యాప్చికం రూ.50గా ఉన్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *