CM Revanth Reddy: పొద్దున్నే ఫీల్డ్‌లో లేపోతే పోస్ట్‌ ఊస్టింగే.. అధికారులకు సీఎం సీరియస్ వార్నింగ్!

CM Revanth Reddy: పొద్దున్నే ఫీల్డ్‌లో లేపోతే పోస్ట్‌ ఊస్టింగే.. అధికారులకు సీఎం సీరియస్ వార్నింగ్!


CM Revanth Reddy: పొద్దున్నే ఫీల్డ్‌లో లేపోతే పోస్ట్‌ ఊస్టింగే.. అధికారులకు సీఎం సీరియస్ వార్నింగ్!

సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. నగరాభివృద్ధిలో సాంకేతికతను మరింతగా ఉపయోగించాలని సీఎం ఆదేశించారు. ప్రధాన జంక్షన్‌ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు అంశంపై అధ్యయనం చేయాలని సూచించారు. భారీ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జ్‌ల నిర్మాణంపై ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.

నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రకటన బోర్డుల ఏర్పాటులో నియంత్రణ అవసరమని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి 10 శాతం అడ్వర్టైజింగ్ స్పేస్ కేటాయించాలని, ప్రతి సంవత్సరం ఫీజు వసూలు చేయాలని సూచించారు. అనధికార ప్రకటన బోర్డులపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

నగరంలో వీధిదీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు. లైటింగ్ వ్యవస్థకు యూనిఫాం కోడ్ అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ విభజనతో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, మూడు కార్పొరేషన్లలో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. అన్ని పార్కుల పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు.

త్వరలో ప్రతి జోన్‌ను స్వయంగా పర్యటిస్తానని సీఎం తెలిపారు. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయం నుంచే ఫీల్డ్‌లో ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు ప్రత్యేకంగా ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *