చేనేత రంగానికి, నేతన్నల కుటుంబాలకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా ప్రజా ప్రభుత్వం పని చేస్తున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం(ఆగష్టు 7) సందర్భంగా నేతన్నలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి అందులో ఇలా ప్రస్తావించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో నేతన్నలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు.
చేనేత కార్మికుల పాత బకాయిలు విడుదల చేయడంతో పాటు, చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ చేయడం జరిగిందని చెప్పారు. చేనేత కార్మికుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ చేనేత అభయ హస్తం పథకం, తెలంగాణ నేతన్న పొదుపు , నేతన్న బీమా, తెలంగాణ నేతన్నకు భరోసా వంటి వినూత్న కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.