రాబోయే పదిన్నరేళ్లు సీఎం కుర్చీ నాదే.. టచ్ చేసేవారే లేరు.. అంటూ ఢిల్లీ వేదికగా జరిగిన చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ టాపింగ్ వ్యవహారం నుంచి ఫార్ములా-ఈ వివాదం వరకు, కాళేశ్వరం నుంచి పాలమూరు ప్రాజెక్టుల వరకు, జనగణన నుంచి జమిలి ఎన్నికల వరకు అనేక కీలక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణకి నేనే రాజు నేనే మంత్రి అని ఢిల్లీ వేదికగా జరిగిన చిట్‌చాట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఎవరు పోటీ కాదని.. పదిన్నరేళ్లు పాటు తానే సీఎంగా ఉంటానన్నారు. జనగణన, డీలిమిటేషన్ తర్వాత 2029లో జమిలిలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అలాగే ఫోన్ ట్యాపింక్ కేసుపై కూడా సీఎం స్పందించారు ఫోన్ టాపింగ్ కేసు తుది అంకానికి చేరిందని భావిస్తున్నానన్నారు. పారదర్శక రిపోర్ట్ కోర్టుకు నివేదిక ఇవ్వాలని పోలీసులకు చెప్పానని.. కేసీఆర్‌ని జైలుకి పంపాలంటే చట్టప్రకారమే జైల్లో వేస్తామన్నారు.
కాళేశ్వరం, ఫార్ములా-e, ట్యాపింగ్.. కేసు ఏదైనా దర్యాప్తు ఆధారంగానే ముందుకు సాగుతుందన్నారు. కాళేశ్వరంలో 3గేట్లే కాదు, ప్రాజెక్ట్ అంతా అధ్యయనం చేయాలని NDSA అంటోందని.. కేసీఆర్, హరీష్‌రావు కోరినట్లు ప్రభుత్వం నడవదన్నారు. కాళేశ్వరం, ఫార్ములా-e, విద్యుత్ స్కామ్‌పై కేంద్రం చర్యలు తీసుకోవచ్చు కదా! అని ప్రశ్నించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.