CM Chandrababu: మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?

CM Chandrababu: మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?


CM Chandrababu: మరోసారి కలెక్టర్లు, మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్.. ఏమన్నారంటే?

జనాభా నిర్వహణ, సంజీవని ప్రాజెక్టు, పౌష్టికాహారం తదితర అంశాలపై కార్యదర్శులు, మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. మంత్రులు, కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని.. వేసవిలో నీటి ఎద్దడి ఉండకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు వస్తే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. పాఠశాలలు, అంగన్వాడీల్లో మధ్యాహ్న భోజనంలో పోషకాహారం ఉండాలని,విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.

అలాగే పోలవరం ప్రాజెక్టు పనులపై కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఇప్పటికే డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తయిందని.. 2027 పుష్కరాల కన్నా ముందే ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేస్తామన్నారు. అలాగే రాబోయే మూడేళ్లలో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కూడా పూర్తవుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అమరావతి మోస్ట్‌ లివబుల్‌ సిటీగా మారుతుందని చెప్పుకొచ్చారు. అలాగే కేంద్రం ప్రభుత్వ సహకారంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కూడా లాభాల్లోకి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *