
లవంగాలలో పుష్కలంగా విటమిన్ లు, మినరల్స్ ఉంటాయి. రోజు రాత్రి పడుకునేటప్పుడు రెండు లవంగాల్ని తినాలని నిపుణులు చెబుతుంటారు. లవంగాలలో జుట్టు రాలడాన్ని నిరోధించే గుణాలు సమృద్ధిగా ఉంటాయి. లవంగాల్ని రాత్రిపూట నీళ్లలో నాన బెట్టి ఉదయం నీళ్లు తాగితే మలబద్దకం ఉండదు. లవంగాల్ని ఎండబెట్టి, పౌడర్ లా చేసి పాలల్లో కల్పి తాగితే ఇమ్యునిటీ పెరుగుతుంది. లవంగాలు నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. వీటిని తీసుకోవడం వల్ల నోటి పూతలు, దంతాల వాపు, చిగురువాపు వంటి చిగుళ్ల సంబంధిత సమస్యల పరిష్కారానికి లవంగ నూనె సాయపడుతుంది.
లవంగాల నీళ్లను తాగే వారిలో బెల్లీ ఫ్యాట్లు ఉంటే కంట్రోల్ లోకి వస్తుంది. పీరియడ్స్ సమస్యలు, పెళ్లాయ్యాక కలయక వల్ల కలిగే సమస్యల్ని లవంగం దూరం చేస్తుంది. అందుకే చాలా మంది వంటలలో కూడా లవంగాల్ని తప్పకుండా ఉపయోగిస్తారు. అంతేకాదు.. లవంగాలు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇవి క్యాన్సర్స్‌తో పోరాడడంలో దోహదం చేస్తాయి.
కడుపులో అల్సర్‌తో బాధపడేవారికి కూడా లవంగాలు తీసుకోవడం మంచిది. ఇది నొప్పి, వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది. లవంగాల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి వేగంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..