CKYC: కేవైసీ ప్రాసెస్ మరింత సులువు.. ప్రతీ ఒక్కరికీ 14 అంకెల నెంబర్.. కేంద్రం కీలక నిర్ణయం

CKYC: కేవైసీ ప్రాసెస్ మరింత సులువు.. ప్రతీ ఒక్కరికీ 14 అంకెల నెంబర్.. కేంద్రం కీలక నిర్ణయం


ఆర్ధిక కార్యకలపాలను వేగవంతం చేసేందుకు, పారదర్శకత తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురానుంది. అదే సీఈవైజీ రిజిస్ట్రి. అంటే సెంట్రలైల్డ్ కేవైసీ వ్యవస్థ అని అర్థం. కస్టమర్ల సమాచారాన్ని ఒకేచోట అందుబాటులో ఉంచేందుకే ఈ కొత్త పద్దతిని కేంద్రం త్వరలో తీసుకురానుంది. కేవైసీ తనిఖీల ఇబ్బంది తగ్గించడం, ఆర్ధిక సేవలను సులభతరం చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేవైసీ ఫ్రేమ్‌వర్క్‌ను త్వరలో కేంద్రం ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. గుర్తింపు ధృవీకరణను బలోపేతం చేయడం, లావాదేవీలు వేగవతం జరిగేలా చేయడం, సులభతర డాక్యుమెంటేషన్, వేగవంతమైన ధృవీకరణ కోసం ఇది సహాయపడుతుంది.

సీకేవైసీ నెంబర్ అంటే..?

సీకేవైసీ ద్వారా ప్రతీ వ్యక్తికి ఒక 14 అంకెల నెంబర్ కేటాయిస్తారు. పేరు, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, ఫొటో, గుర్తింపు పత్రాలతో పాటు ప్రత్యేకమైన గుర్తింపుకు అవసరమైనవి అన్నీ ఉంటాయి. అంటే ఒక డిజిటల్ ఫైల్‌గా ఇది ఉంటుంది. ఆర్ధికశాఖకు చెందిన సెంట్రల్ రిజిస్ట్రీ ఆఫ్ సెక్యూరిటైజేషన్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ సీకేవైసీని నిర్వహిస్తుంది. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర సంస్థలు ఈ డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. కాలానుగుణంగా ఈ డేటాను అప్డేట్ చేస్తూ ఉంటారు. దీని వల్ల కేవైసీ విధానం మరింత వేగవంతమవుతుంది.

అన్నింటికీ ఒక్కటే..

ప్రతీ వ్యక్తికి ఒక సీకేవైసీ నెంబర్ కేటాయిస్తారు. దీని వల్ల వివరాలు తెలుసుకోవడం సులభమవుతుంది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలన్నా, బీమా పాలసీ తీసుకోవాలన్నా, కారు కొనాలన్నా ప్రతీసారి పత్రాలను సమర్పించాల్సిన అవసరం ఉండదు. సీకేవైసీ నెంబర్‌ను చెబితే కేవైసీ వివరాలు క్షణాల్లోనే ప్రత్యక్షమవుతాయి. దీని వల్ల సమయం ఆదా అవుతుంది. ఆర్ధిక ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో ఆన్ బోర్డింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది. గుర్తింపు ధృవీకరణ ఒకే విధానం ద్వారా జరగడం వల్ల మోసాలు కూడా తగ్గుతాయి. అయితే ఈ సీకేవైసీ నెంబర్‌ను పొందటానికి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా అర్ధిక సంస్థతో మొదటి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసినప్పుడు ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. ఈ ప్రక్రియ చేపట్టే సమయంలో ఆధార్, పాన్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది.  ఆ సమాచారం ఉపయోగించుకుని కేవైసీ ఫారం నింపుతారు. ఆ తర్వాత వీడియో కేవైసీ పూర్తి చేయాల్స ఉంటుంది. అనంతరం సీకేవైసీ నెంబర్ క్రియేట్ అవుతుంది. ఈ నెంబర్ ద్వారా మీరు అన్ని ఆర్ధిక ప్రయోజనాలు పొందుతారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *