ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బోర్డర్ 2 సినిమా దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కానీ మీకు తెలుసా..2026లో సూపర్ హిట్ అయిన ఓ సినిమా గురించి. ప్రస్తుతం ఆ మూవీ ఏకంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ మూవీ గురించి అసలు విషయాలు తెలుసుకుందామా.
బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తుంది. అంతేకాదు..ఆ 400 కోట్ల మార్కును అధిగమించే దిశగా దూసుకుపోతోంది. మకర సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం “ది రాజా సాబ్,” “పరాశక్తి,” “వా వాథియార్,” “భర్త మహాశయులకు విజ్ఞప్తి” వంటి చిత్రాలతో పోటీ పడింది.
మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు “మనం శంకర్ వరప్రసాద్ గారు” అని పేరు పెట్టారు. దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన క్లాసిక్ కామెడీ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం అభిమానులు, కుటుంబ ప్రేక్షకుల తెగ ఆకట్టుకుంది. ఈ చిత్రం ప్రారంభ రోజు నుండే మంచి వసూల్లు రాబట్టింది.
ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా, ఇది రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది, ఇది రూ.240 కోట్ల బ్రేక్-ఈవెన్ లక్ష్యాన్ని మించిపోయింది. ప్రస్తుత వేగాన్ని బట్టి చూస్తే, ఈ సినిమా ₹400 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార కీలకపాత్రలో నటించింది. ఈ సినిమా ఫిబ్రవరి 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠి సహా 7 భాషలలో విడుదల కాబోతుంది.




