కంటెంట్ బలంగా ఉంటే చాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించిన చిత్రాలు చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం రూ.16 కోట్లతో నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబ్టటింది. ముందుగా కన్నడలో విడుదలై ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలోకి డబ్ అయ్యింది. ఫలతింగా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్స్ కొల్లగొట్టింది. ఈ సినిమాలోని శక్తివంతమైన విజువల్స్.. క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. ? 2022లో విడుదలైన కాంతార: ది లెజెండ్.
ఇవి కూడా చదవండి: Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..
కన్నడలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో పోషించాడు. అలాగే ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. కర్ణాటకలోని ఒక తీరప్రాంత గ్రామంలో జరిగిన ఈ కథ మనిషికి, ప్రకృతికి మధ్య జరిగే సంఘర్షణ, సంప్రదాయం.. ఆధునిక దురాశను చూపిస్తుంది. స్థానిక జానపద కథలు, ఆచారాలు, కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల్లో పూజించబడే భూత కోల అనే పురాతన సంప్రదాయాన్ని అందంగా వెండితెరపైకి తీసుకువచ్చారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి యాక్టింగ్ హైలెట్. అలాగే మ్యూజిక్ సైతం మరో ప్రధాన బలం.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇందులో సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రకు ప్రాణం పోశారు. అలాగే సినిమాటోగ్రఫీ, బీజీఎం మరో హైలెట్. ఈ సినిమా భారతీయ సినిమాల్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. థియేటర్లలోనే కాకుండా అటు ఓటీటీల్లోనూ ఈ మూవీ సంచలనం సృష్టించింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి: Tollywood: ఉదయం లేవగానే ముఖానికి ఉమ్మీ రాసుకుంటాను.. స్టార్ హీరోయిన్ బ్యూటీ సీక్రెట్.. ఫ్యాన్స్ షాక్..
ఇవి కూడా చదవండి: Pawan Kalyan: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో గుర్తుపట్టారా.. ?