Headlines

Chiranjeevi- Pawan Kalyan: చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే.. ఊహించని రిజల్ట్

Chiranjeevi- Pawan Kalyan: చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ సినిమా.. కట్ చేస్తే.. ఊహించని రిజల్ట్


సినిమా కథల ఎంపికలో ఒక్కో హీరోకు ఒక్కో శైలి ఉంటుంది. డైరెక్టర్ కథ చెప్పేటప్పుడే కొందరు హీరోలు సినిమా రిజల్ట్ ను అంచనా వేస్తారు. కథలు తమకు సూటయితే వెంటనే ఒకే చెబుతారు. లేకుంటే సున్నితంగా రిజెక్ట్ చేయడమో లేదా మార్పులు చేర్పులు సూచించడమో చేస్తుంటారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యం మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు. 150కు పైగా సినిమాలు చేసిన ఘనత ఆయన సొంతం. ఒక సినిమాను ఎంపిక చేసుకోవడంలో చాలా అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మూవీ చేయాలా? వద్దా? చేస్తే హిట్ అవుతుందా? లేదా? ప్రేక్షకులకు నచ్చుతుందా? ఇలా చాలా విషయాలు కచ్చితంగా ఆలోచిస్తారు. అలా ఓ సినిమా విషయంలో చిరంజీవి, పవన్ కల్యాణ్‌ ల మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ డైరెక్టర్ చిరంజీవి వద్దకు కథ తీసుకుని వెళ్లారు. చిరంజీవి కూడా ఆ కథ విని చాలా బాగుందన్నారు. అయితే ఈ స్టోరీ తన ఇమేజ్ కి సెట్ కాదేమో అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కు సెట్ అవుతుందని సూచించారట. అలా చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో పవన్ కల్యాణ్ చేసిన సినిమా ఏంటో తెలుసా అన్నవరం.

సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన అన్నవరం సినిమా యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమాలో ఆసిన్ హీరోయిన్ గా నటించింది. ప్రేమిస్తే ఫేమ్ సంధ్య పవన్ సోదరి పాత్రలో మెప్పించింది. అభిమానులు ఈ మూవీపై భారీగా ఆశలు పెట్టుకున్నారు.. కానీ.. అన్నవరం సినిమా యావరేజ్ గా నిలిచింది. పవన్ కల్యాణ్ సినిమాల్లో సహజంగా ఉండే మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ మూవీలో లేకపోవడం మైనస్ గా మారింది. అయితే డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల పరంగా ఆ సినిమా కమర్షియల్ గా సేఫ్ అని భీమనేని శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

చిరంజీవి లేటెస్ట్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *