Chiranjeevi: ‘చిరు లీక్’ ఎఫెక్ట్.. బయటికొచ్చిన విశ్వంభర రిలీజ్ డేట్

Chiranjeevi: ‘చిరు లీక్’ ఎఫెక్ట్.. బయటికొచ్చిన విశ్వంభర రిలీజ్ డేట్


ఎట్టకేలకు విశ్వంభర సినిమా రిలీజ్‌ గురించి ఓ అప్డేట్ బయటికి వచ్చింది. రీసెంట్‌గా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులతో ముచ్చటించిన మెగాస్టార్.. విశ్వంభర మూవీ జులై9 రిలీజ్‌ అయ్యే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు CGలు తానింక చూడలేదని.. చూశాక మరింత క్లారిటీ వస్తుందన్నారు. ఇక బాబీతో తాను చేయబోయే సినిమా.. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుందంటూ .. బోనస్‌గా మరో హింట్ ఇచ్చారు మెగాస్టార్. యంగ్ హీరోగా ట్రాన్స్‌ఫాం అయిన మెగాస్టార్ ఇప్పుడు సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. వరుస సినిమాలుప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన సినిమా జర్నీ గురించి రీసెంట్‌గా ఓ మీడియా గ్యాథరింగ్‌ లో మాట్లాడిన చిరు.. తాను రాజకీయాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాక అంతా కొత్తగా అనిపించిందంటూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఉండగా ఇండస్ట్రీ మీద ఫోకస్ తగ్గిందని అన్నారు. తనకు ఖైదీ 150 చేస్తున్న టైంలో.. కాజల్ ఎవరో కూడా తెలీయలేదన్నారు. వినాయక్.. మన హీరోయిన్ కాజల్‌ అని చెబితే ఎవరు అని అడిగేసినట్టు చెప్పారు.తమన్నా ఎవరో కూడా తెలియదని చెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో ఉండగా ఇండస్ట్రీని ఎంత గా మిస్‌ అయ్యానో ఇప్పుడు అర్థమవుతుందంటూ.. చెప్పుకొచ్చారు చిరు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గడ్డకట్టిన నయాగరా ఫాల్స్‌.. వింటర్‌ వండర్‌ను చూసారా ??

ప్రమాదకర ఎయిర్ పోర్ట్‌లు ఇవే.. ల్యాండింగ్ కత్తి మీద సామే

మళ్లీ బతకాలన్న ఆశతో.. భద్రపరుస్తున్న మృత దేహాలు

ONGC పైప్ లైన్ నుండి భారీగా గ్యాస్ లీక్.. భయాందోళనలో ప్రజలు

బంగారం, వెండిధరల ఎఫెక్ట్‌.. రెచ్చిపోయిన దొంగలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *