మన శంకరవరప్రసాద్ గారు సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి పెద్దగా కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ ఫొటోల్లో చిరంజీవి చేతికి కట్టుతో కనిపించారు. వివరాల్లోకి వెళితే.. మార్చి 6న అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ పెళ్లి జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి. పెళ్లి శుభలేఖల పంపిణీ కూడా ప్రారంభించారు. ఈక్రమంలో అల్లు ఫ్యామిలీ మొదటి శుభలేఖను మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చారు. అల్లు అరవింద్ తో పాటు ఆయన సతీమణి, అలు శిరీష్ తో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం నూతన వస్త్రాలతో పాటు పెళ్లి శుభలేఖ ను చిరంజీవి-సురేఖ దంపతులకు అందించారు. అయితే ఈ ఫోటోల్లో చిరంజీవి ఎడమ చేతికి హ్యాండ్ బెల్ట్ వేసుకుని కనిపించారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు చిరంజీవి చేతికి ఏమయ్యింది. ఎందుకు ఇలా షోల్డర్ బ్యాగ్ తో కనిపించారు? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి భుజానికి చిన్న సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. గత నెలలో ఈ శస్త్ర చికిత్స జరిగిందని సమాచారం. అందుకే భుజంపై ఒత్తిడి పడకుండా ఉండడం కోసమే చిరంజీవి ఈ హ్యాండ్ బెల్ట్ ను వాడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ను సందర్శించారు. అక్కడ కూడా తన అభిమానులతో కలిసి సరదాగా ఫొటోలు, వీడియోలు దిగారు. నొప్పిని భరిస్తూనే ఫ్యాన్స్ తో ఫొటోలు దిగారు మెగాస్టార్.
ఇవి కూడా చదవండి
చేతికి కట్టుతో చిరంజీవి.. వీడియో ఇదిగో..
షోల్డర్ బ్యాగ్‌తో చిరంజీవి.. ఫ్యాన్స్ ఆందోళన!
మెగాస్టార్ చిరంజీవి తన అభిమానుల పట్ల తనకు ఉన్న అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు. ఆయన చిరంజీవి ఐ&బ్లడ్ బ్యాంక్‌ను సందర్శించి అభిమానులతో గడిపారు. వారితో ఆత్మీయంగా మాట్లాడి, ఫోటోలు దిగారు. అయితే ఈ వీడియోలో మెగాస్టార్ షోల్డర్ బ్యాగ్‌తో… pic.twitter.com/ibTMADfq0g
— ChotaNews App (@ChotaNewsApp) February 15, 2026
ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అనస్వర రాజన్ లేదా సారా అర్జున్ ఎవరిలో ఒకరు చిరంజీవి కూతురిగా నటిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు ఇప్పటికే ప్రారంభమైన విశ్వంభర సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి