ఇప్పుడు సోషల్ మీడియాలో చిరు షోల్డర్ పట్టీనే పెద్ద హాట్ టాపిక్ అవుతోంది. మెగా స్టార్‌కు ఏమైందని అందరూ ఆరా తీయడం.. ఆందోళన చెందడం ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే ఇదంతా గమనిస్తున్న చిరు.. రియాక్టయ్యారు. తనకు జరిగిన చిరు సర్జరీ గురించి.. తనే స్వయంగా వివరిస్తూ ఓ ట్వీట్ చేశారు. తాను బానే ఉన్నానని.. కోలుకుంటున్నాని తన ట్వీట్లో కోట్ చేశారు మెగాస్టార్. చేతికి పట్టీ ఉండటం గమనించి పలువురు శ్రేయోభిలాషులు తన ఆరోగ్యం గురించి ఆరా తీశారని తన ట్వీట్లో రాసుకొచ్చిన చిరంజీవి… తన భుజానికి చిన్న కీ-హోల్ సర్జరీ జరిగిందంటూ క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం తాను బాగానే కోలుకుంటున్నానని.. ఇప్పటికే తనరొటీన్ లైఫ్ కు తిరిగి వస్తున్నా అన్నారు చిరు.ఈ విషయంలో ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సర్జరీ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, ఆయన నైపుణ్యంతో ఆ ప్రక్రియ అంతా సజావుగా, సౌకర్యవంతంగా సాగిందంటూ.. ఆయన్ను అందరికీ పరిచయం చేశారు. అంతేకాదు తన పట్ల అందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు,దీవెనలకు మెగాస్టార్ చిరు సంతోషం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
With Love: 10 రోజుల్లో 25 కోట్లు..! దుమ్ము దులుపుతున్న విత్ లవ్ సినిమా కలెక్షన్స్
పాటలో ఎవరికి ఎంత హక్కు ?? IPRS, PPL అంటే ఏంటి ??
ఈ ఆకులతో అద్భుత ప్రయోజనాలు.. ఆ సమస్యలు పరార్!
సిమ్ కార్డుల నుంచి బంగారం తీశాడు !! ఎలాగంటే
ఏరియా 51లోనే ఏలియన్స్ ?? అంతరిక్షంలో జీవం ఉంది !!