Chiranjeevi: ఓ శశిరేఖా.. ఓ మాట చెప్పాలి

Chiranjeevi: ఓ శశిరేఖా.. ఓ మాట చెప్పాలి


తన భార్య సురేఖ పుట్టిన రోజు సందర్భంగా.. మెగాస్టార్ చిరు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. తన 44 ఏళ్ల వైవాహిక జీవితంలోని తీపి జ్ఞాపకాలను, తన భార్య గొప్పతనాన్ని ఆయన ఈ పోస్ట్‌లో వివరించారు. తన ప్రశాంతత, సపోర్ట్ సిస్టమ్, కుటుంబానికి బలమైన పునాది అంటూ తన భార్య సురేఖ గురించి చెప్పుకొచ్చారు మెగాస్టార్. అంతేకాదు తాను షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పుడు, ఇంటి బాధ్యతలన్నీ తనే భుజాన వేసుకుని కుటుంబాన్ని నడిపించింది తన భార్యే అంటూ గుర్తు చేసుకున్నారు. తన తల్లిదండ్రులను, తోబుట్టువులను తన సొంతవారిలా చూసుకుంటూ.. కోడలిగా కంటే ఒక కూతురిలా సురేఖ అందరి మనసు గెలుచుకుందంటూ తన పోస్టులో చిరు రాసుకొచ్చారు. అంతేకాదు తన ప్రతి విజయంలోనూ సురేఖ వంతు ఉందని.. తను ఇంట్లో అన్ని బాధ్యతలు మోసింది కాబట్టే, తాను కెమెరా ముందు ఇంతగా మెరవగలిగాను అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. జీవితాంతం తన భార్య సురేఖకు రుణపడి ఉంటానని తన పోస్టులో కోట్ చేశారు మెగాస్టార్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చూపు కోల్పోయిన 9 మంది.. వికటించిన కంటి వైద్యం

శ్రీశైలం మల్లన్నకు కాసుల వర్షం..13 రోజుల్లోనే ఏకంగా..

పెళ్లి కూతురిపై నోట్ల వర్షం.. రూ. 8.5 కోట్లు వెదజల్లిన ఫ్యామిలీ!

తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు.. చివరికి..

రైతు ఇంట సిరులు కురిపిస్తున్న పంట !! అధిక దిగుబడితో సంతోషం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *