Children Memory Tips: మీ పిల్లలు పరీక్షల సమయంలో చదివినవన్నీ మర్చిపోతున్నారా? ఈ చిన్న మార్పు చేసి చూడండి..

Children Memory Tips: మీ పిల్లలు పరీక్షల సమయంలో చదివినవన్నీ మర్చిపోతున్నారా? ఈ చిన్న మార్పు చేసి చూడండి..


తమ పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి మార్కులు సాధించాలని, చురుగ్గా ఉండాలని, బాగా రాణించాలని దాదాపు ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకే వారిని బాగా చదవమని బలవంతం విసిగిస్తుంటారు. కానీ కొంతమంది పిల్లలు ఇంట్లో, పాఠశాలలో ఎంత బాగా చదివినా, అన్నీ మర్చిపోతారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో చాలా మంది పిల్లలు తాము చదివినవన్నీ మర్చిపోతారు. దీనికి కారణం జ్ఞాపకశక్తి లేకపోవడం. ఇటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లలను కొట్టడం, తిట్టడం కంటే ఈ కింది కొన్ని చిట్కాలను అనుసరించడం మంచిది. తద్వారా పిల్లల జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి ఏమేం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

మీ పిల్లల జ్ఞాపకశక్తి మెరుగుపడాలంటే ఈ కింది అలవాట్లలో మార్పులు అవసరం

సరైన నిద్ర

పిల్లల మెదడు సమర్థవంతంగా పనిచేయడానికి తగినంత విశ్రాంతి అవసరం. పిల్లలకు రోజుకు కనీసం 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం. మంచి రాత్రి నిద్ర మెదడు పగటిపూట నేర్చుకున్న వాటిని నిలుపుకోవడానికి సహాయపడుతుంది. నిద్ర కూడా శ్రద్ధను మెరుగుపరుస్తుంది. కాబట్టి ముందుగా మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్ వాడకాన్ని తగ్గించి, సరైన సమయంలో పడుకునే అలవాటును పిల్లలలో పెంపొందించాలి.

ఆరోగ్యకరమైన అల్పాహారం, ఆహారం ఇవ్వాలి

పిల్లలకు అల్పాహారం చాలా ముఖ్యం. ఇది మెదడుకు అవసరమైన పోషకాలు, శక్తిని అందిస్తుంది. ఉదయం పాఠశాలకు వెళ్లాలనే తొందరలో, చాలా మంది పిల్లలు అల్పాహారం (బ్రేక్‌ ఫాస్ట్‌) తినకుండా పాఠశాలకు వెళతారు. కానీ ఇది శరీరానికి, మెదడుకు హానికరం. కాబట్టి, పిల్లలకు అల్పాహారంగా తృణధాన్యాలు, పండ్లు, పాలు వంటి పోషకమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వాలి. ఇది వారిని తరగతి గదిలో చురుకుగా, ఉత్సాహంగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

చదివే అలవాటు

మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్‌ల వాడకాన్ని తగ్గించి, పిల్లలకు కథల పుస్తకాలు, వార్తాపత్రికలు చదవడానికి ఇవ్వాలి. ఇలా వారు రోజుకు కనీసం 20 నిమిషాలు చదివే అలవాటును పెంచుకుంటే, వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. లేకపోతే తల్లిదండ్రులు పిల్లలకు కథలు చెప్పవచ్చు. ఇది వారి జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుంది.

ఆటలు

పజిల్స్, సుడోకు, బ్లాక్స్, మెమరీ కార్డులు వంటి ఆటలు పిల్లలతో ఆడిపించాలి. ఇది సరదా ఆట మాత్రమే కాదు, మెదడుకు వ్యాయామం కూడా ఇస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది. అలాగే మొబైల్, టీవీకి బదులుగా పిల్లల కోసం ఇటువంటి ఆటలు ఆడించాలి. ఇటువంటి ఆటలు పిల్లల ఆలోచన, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

ప్రాణాయామం, ధ్యానం

పిల్లలకు ఉదయం 10 నిమిషాలు శ్వాస వ్యాయామాలు చేయమని చెప్పాలి. ఇది పిల్లల మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. వారి దృష్టిని మెరుగుపరుస్తుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *