Child Psychology: మీ పిల్లలకు మీరే మార్గదర్శి! అసలైన విజయానికి నిర్వచనం నేర్పించాల్సిన బాధ్యతా మీదే

Child Psychology: మీ పిల్లలకు మీరే మార్గదర్శి! అసలైన విజయానికి నిర్వచనం నేర్పించాల్సిన బాధ్యతా మీదే


తాము ఎందుకూ పనికిరామని భావించే ప్రమాదం కూడా ఉంది. నిజానికి గెలుపు అనేది ఆనందాన్ని ఇస్తే, ఓటమి అనేది పాఠాన్ని నేర్పుతుంది. పిల్లలు ఓటమిని ఎదుర్కొన్నప్పుడు వారు కుంగిపోకుండా, మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నించేలా చేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం. పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని, మానసిక స్థైర్యాన్ని ఎలా నింపాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

శ్రమను గుర్తించండి

మనం చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే.. పిల్లలకు కేవలం మార్కులు లేదా ట్రోఫీలు వచ్చినప్పుడే మెచ్చుకోవడం. దీనివల్ల వారు ఫలితం కోసం మాత్రమే పరిగెడతారు. దానికి బదులుగా, ఆ లక్ష్యం కోసం వారు పడిన కష్టాన్ని, చూపిన అంకితభావాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. ‘నువ్వు ఈ రోజు గెలవకపోవచ్చు, కానీ ఈ పోటీ కోసం నువ్వు చేసిన కష్టం నాకు చాలా గర్వంగా అనిపించింది’ అనే ఒక్క చిన్న మాట వారిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. అప్పుడు వారు ఓటమిని అవమానంగా కాకుండా, ఒక అనుభవంగా భావిస్తారు.

పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా పోటీలో ఓడిపోయినప్పుడు మందలించడం వల్ల వారిలో భయం పెరుగుతుంది. భవిష్యత్తులో కొత్త పనులు చేయడానికి వారు వెనకాడుతారు. ఓటమి పాలైనప్పుడు ‘నువ్వు ఎందుకు సరిగ్గా చేయలేదు?’ అని ప్రశ్నించే కంటే.. ‘ఎక్కడ తప్పు జరిగింది? వచ్చేసారి ఇంకా బాగా చేయడానికి మనం ఏం చేయాలి?’ అని వారితో కూర్చొని చర్చించండి. తప్పులను దిద్దుకోవడం నేర్పితే, వారు ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవడం ప్రారంభిస్తారు.

అభినందించడం నేర్పండి..

ఆట ఏదైనా సరే.. మనం ఓడిపోయినప్పుడు గెలిచిన ప్రత్యర్థిని అభినందించడం అనేది గొప్ప సంస్కారం. ఇది పిల్లల్లో ఎదుటివారి పట్ల అసూయను తగ్గించి, గౌరవాన్ని పెంచుతుంది. పక్కవారి విజయాన్ని చూసి ఆనందించడం నేర్చుకున్న పిల్లలు, భవిష్యత్తులో ఉన్నతమైన వ్యక్తులుగా ఎదుగుతారు. ఇది వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఉత్తమ మార్గం.

జీవితంలో గెలుపోటములు అనేవి నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి. ఈ రోజు ఓడిపోతే రేపు గెలవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఏ విజేత కూడా ఓటమిని చవిచూడకుండా శిఖరాగ్రానికి చేరుకోలేదని గొప్ప వ్యక్తుల ఉదాహరణలతో వివరించాలి. దీనివల్ల వారు ఓటమిని సహజంగా స్వీకరించడం నేర్చుకుంటారు.

పిల్లలు మీరు చెప్పే మాటల కంటే, మీరు చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు. ఇంట్లో ఏదైనా చిన్న సమస్య ఎదురైనప్పుడు లేదా మీరు ఏదైనా పనిలో విఫలమైనప్పుడు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటున్నారో వారు గమనిస్తూనే ఉంటారు. మీరు ఓటమిని ధైర్యంగా, ప్రశాంతంగా స్వీకరిస్తే.. మీ పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారు. మీ ప్రవర్తనే వారికి నిశ్శబ్ద పాఠంలా పనిచేస్తుంది.

ఓడిపోయినప్పుడు పిల్లలు బాధపడటం, ఏడవడం చాలా సహజం. ఆ సమయంలో ‘చిన్నదానికే ఎందుకు ఏడుస్తావు?’ అని వారి బాధను తక్కువ చేయకండి. దానికి బదులుగా.. ‘నీకు బాధగా ఉందని నాకు తెలుసు, పర్వాలేదు’ అని వారిని దగ్గరకు తీసుకోండి. వారి భావాలను గౌరవిస్తూనే, ఆ బాధ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ప్రయత్నించేలా ప్రోత్సహించాలి. తల్లిదండ్రుల అండ ఉందనే నమ్మకం వారిని దేనికైనా సిద్ధపడేలా చేస్తుంది. పిల్లలకు కావలసింది కేవలం మెడల్స్ కాదు, ఓడిపోయినప్పుడు తోడుగా నిలిచే భరోసా. ఓటమిని ఎదురించడం నేర్చుకున్న పిల్లాడే రేపటి సమాజంలో గొప్ప విజేతగా నిలబడతాడు. విజయంతో గర్వపడకుండా, ఓటమితో కుంగిపోకుండా ఉండే స్థితప్రజ్ఞతను వారికి చిన్నప్పుడే నేర్పించాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *