తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్‌లో శనివారం ఉదయం ఓ ఆడ చిరుత మృతి చెందింది. చిరుత మరణానికి తీవ్ర అనారోగ్యమే కారణమని జూపార్క్ అధికారులు తెలిపారు. మృతదేహాన్ని తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీకి తరలించారు సిబ్బంది. అధికారుల సమక్షంలో అక్కడ పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం చిరుత మృతదేహాన్ని ఖననం చేశారు. జూ పార్కు సిబ్బంది, ఇతర ఉన్నతాధికారులు అంత్యక్రియలకు హాజరై చిరుతకు తుది వీడ్కోలు పలికారు.
2023లో కూడా తిరుపతి జూలో ఓ చిరుత పిల్ల ఇలాగే అనారోగ్య కారణాలతో మరణించింది. తాజా ఘటనతో జూ పార్కులో ఉన్న మిగతా జంతువుల సంరక్షణపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర జంతువుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు.. జంతు సంరక్షణ నిపుణులు జూ అధికారులతో కలిసి జంతువుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. జూ పార్కులో ఉన్న ఇతర జంతువుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించి, వాటికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూడాలని నిపుణులు కోరారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..