భారతీయ ఆహార పదార్థాలలో చపాతీ కూడా ముఖ్యమైనది. ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా చపాతీ తింటారు. కానీ, దక్షిణ భారతదేశంలోనూ ఇది ప్రధాన ఆహార పదార్థాలలో ఒకటిగా ఉంది. ఎక్కువగా రాత్రి సమయంలో చపాతీని ఇక్కడ తీసుకుంటారు. అయితే, చపాతీ చేసే విధానాలు కొన్ని భిన్నంగా ఉంటాయి. చపాతీలు/రోటీలను చేసేందుకు ఎక్కువగా పెనం వాడతారు. కానీ, కొందరు మాత్రం డైరెక్టుగా పొయ్యి లేదా గ్యాస్ స్టవ్‌పైనే కాలుస్తూ ఉంటారు. నేరుగా మంటపైనే రోటీని కాల్చితే అదో రకమైన రుచి ఉంటుంది. ఈ టేస్ట్‌ను చాలా మంది ఇష్టపడి తింటూంటారు. అయితే, ఇలా చపాతీలను లేదా రోటీలను కాల్చినప్పుడు వాటిపై బాగా కాలడంతో నల్లటి మచ్చలుగా ఏర్పడతాయి. కొంచెం బొగ్గులా ఉండే వీటిని తీసుకుంటే క్యాన్సర్ వస్తుందనే ప్రచారం కూడా ఉంది. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ విషయం
గురించిన వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం. గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ దేబాషిష్ చౌదరి ఈ ఆందోళనను శాస్త్రీయ పరంగా వివరించారు.