Chanakya Niti: డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! మిమ్మల్ని గట్టెక్కించే చాణక్యుడి మనీ టిప్స్..!

Chanakya Niti: డబ్బు విషయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు..! మిమ్మల్ని గట్టెక్కించే చాణక్యుడి మనీ టిప్స్..!


నేటి ఆధునిక జీవనశైలిలో ఆర్థిక లావాదేవీలు సర్వసాధారణంగా మారాయి. వ్యక్తిగత అవసరాలు, అత్యవసర పరిస్థితులు లేదా వ్యాపార అవసరాల కారణంగా అప్పులు తీసుకోవడం, ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. అయితే, డబ్బే ఎన్నో మంచి సంబంధాలకు చీలిక తెచ్చిన ఉదాహరణలు కోకొల్లలు. కుటుంబ బంధాలు, స్నేహాలు, చివరికి చట్టపరమైన వివాదాలకూ ఆర్థిక లావాదేవీలే కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గొప్ప దౌత్యవేత్త ఆచార్య చాణక్యుడు.. డబ్బు నిర్వహణ, రుణాల విషయంలో కొన్ని కఠినమైన, అత్యంత ప్రాయోగికమైన నియమాలను సూచించాడు. ఈ నియమాలను పాటిస్తే ఆర్థిక సంక్షోభాల నుంచి తప్పించుకోవడమే కాకుండా, సమాజంలో గౌరవం, విశ్వసనీయత కూడా పెరుగుతాయని చాణక్య నీతి చెబుతోంది.

ఆర్థిక లావాదేవీల్లో ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సిన మూడు ముఖ్యమైన విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రుణం తీసుకునే ముందు తప్పక ఆలోచించాలి

చాణక్యుడి ప్రకారం, అప్పు తీసుకోవడం తప్పు కాదు. కానీ సరైన ప్రణాళిక లేకుండా రుణం తీసుకోవడం ఆత్మహత్యతో సమానం. రుణం తీసుకునే ముందు నిజంగా ఆ అవసరం ఎంతవరకు అవసరమో, దాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం మనకు ఉందో లేదో స్పష్టంగా అంచనా వేసుకోవాలి.

ఆడంబరాలు, హోదా ప్రదర్శన కోసం కొంతమంది అప్పులు చేస్తుంటారు. ఇది భవిష్యత్తులో తీవ్ర మానసిక ఒత్తిడికి, అవమానానికి దారి తీస్తుందని చాణక్యుడు హెచ్చరించాడు. అలాగే, అప్పులు ఎల్లప్పుడూ నమ్మకమైన బ్యాంకు లేదా విశ్వసనీయ వ్యక్తుల నుంచే తీసుకోవాలి. అనైతిక మార్గాల ద్వారా తీసుకున్న డబ్బు వడ్డీతో పాటు మనశ్శాంతినీ హరించేస్తుందని హెచ్చరించాడు చాణక్యుడు.

ఎవరికైనా అప్పు ఇవ్వేముందు జాగ్రత్త

దాతృత్వం గురించి చాణక్యుడు స్పష్టమైన నియమాలు చెప్పారు. ఎవరికైనా డబ్బు ఇవ్వేముందు, ఆ వ్యక్తికి తిరిగి చెల్లించే ఉద్దేశ్యం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి. అంతేకాదు, చెల్లించే సామర్థ్యం ఉందని నిర్ధారించుకున్న తర్వాతే అప్పు ఇవ్వాలని ఆయన సూచించాడు.

అనర్హుడైన వ్యక్తికి డబ్బు ఇవ్వడం అంటే మనమే మన నష్టానికి కారణమవడం అని చాణక్య నీతి చెబుతుంది. కేవలం బంధాలు, సంబంధాల కారణంగా కష్టపడి సంపాదించిన డబ్బును నిర్లక్ష్యంగా అప్పగించవద్దని హెచ్చరిస్తుంది.

రాతపూర్వక హామీ తప్పనిసరి

“నోటి మాట నమ్మకం కాదు” అన్నది చాణక్యుడి స్పష్టమైన అభిప్రాయం. ఆర్థిక లావాదేవీలు ఎల్లప్పుడూ స్పష్టమైన, వ్రాతపూర్వక నిబంధనలతో జరగాలని ఆయన సూచించాడు. వ్రాతపూర్వక రుజువు లేకపోతే, భవిష్యత్తులో వివాదాలు తలెత్తే అవకాశం ఎక్కువ.

చెల్లింపు గడువులు, వడ్డీ వంటి అంశాలను ముందుగానే స్పష్టంగా పేర్కొనడం వల్ల అనవసర ఘర్షణలను నివారించవచ్చు. దీనివల్ల సంబంధాల్లో నమ్మకం కొనసాగడమే కాకుండా, మానసిక ప్రశాంతత కూడా దక్కుతుందని చాణక్య నీతి స్పష్టం చేస్తోంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం అందుబాటులోని వనరుల నుంచి సేకరించి.. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *