Central Government: త్వరలో రైతులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్..! ఆ పథకంలో మార్పులు.. అందరికీ ప్రయోజనం

Central Government: త్వరలో రైతులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్..! ఆ పథకంలో మార్పులు.. అందరికీ ప్రయోజనం


Central Government: త్వరలో రైతులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్..! ఆ పథకంలో మార్పులు.. అందరికీ ప్రయోజనం

రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ అందించింది. బ్యాంకుల ద్వారా రైతులకు ఇచ్చే రుణ సదుపాయంకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా దేశంలోని రైతులు సులువుగా, వేగవంతంగా రూ.3 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఎప్పటినుంచో కల్పిస్తోంది. రైతులకు మరింత ప్రయోజనం కల్పించేందుకు ఈ పథకంలో మార్పులు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. త్వరలో బ్యాంకులు దీనికి సంబంధించి ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. ఈ కొత్త గైడ్‌లైన్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం

ఆరు సంవత్సరాలకు పెంపు..!

కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులకు ఇచ్చే రుణాలను తిరిగి చెల్లించే కాల వ్యవధిని పెంచనున్నారు. ఈ కాల పరిమితిని ఆరు సంవత్సరాలకు పెంచనున్నారని తెలుస్తోంది. ఆర్బీఐ ప్రధాన ప్రతిపాదనల్లో ఇది ఒకటి ఉంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల వల్ల రైతులు రుణ పరిమితిని ఎక్కువ కాలం ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇప్పుడు కాలపరిమితిని పెంచడం వల్ల చెల్లించడానికి ఎక్కువ కాలం ఉంటుంది. ఇది రైతులకు ఇది ఉపయోగకరంగానూ ఉంటుంది. దీని వల్ల రైతులు సీజన్ ప్రకారం తిరిగి చెల్లించడం సులభతరం అవుతుంది.

మరింత లోన్ పొందే సౌకర్యం

ఇక రైతులకు రుణ పరిమితి పెరిగేలా ఆర్బీఐ కొత్త రూల్స్‌ను తీసుకురానుంది. రైతుల స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌తో క్రెడిట్ పరిమితిని అనుసంధానించేందుకు ప్రయత్నిస్తోంది. రైతులు వారి వ్యవసాయ ఖర్చుల ప్రకారం ఖచ్చితమైన సముచితమైన క్రెడిట్‌ను పొందడం దీని వల్ల సాధ్యమవుతుంది. ఇది చాలా మంది రైతులకు పెద్ద ప్రయోజనం చేకూరుస్తుంది. మరింత ఎక్కువ రుణం పొందేందుకు ఇది సహాయపడుతుంది

వ్యవసాయ పరికరాల కొనుగోలు

కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా వ్యవసాయ పనిముట్లు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, స్మార్ట్ వ్యవసాయ పరికరాలు, ఇతర వ్యవసాయ పారిశ్రామిక పనిముట్లను కొనుగోలు చేసేలా కొత్త నియమాలు త్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా రైతులకు పెద్ద ఉపశమనం కలగనుంది. KCC కింద నియమాలను మరింత స్థిరంగా, స్పష్టంగా, పారదర్శకంగా చేయడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. తక్షణ రుణాలు వేగంగా పొందడానికి ఈ రూల్స్ ఉపయోగపడనున్నాయి. ఈ నియమాలు ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై ఇప్పటివరకు ఇంకా ఎటువంటి అధికారిక  సమాచారం బయటకు రాలేద. అయతే త్వరలో ఇందుుక సంబంధించిన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. దీంతో క్రిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా రైతుల మరింత బెనిఫిట్ త్వరలో పొందవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *