Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం.. వీరికి ప్రతీనెలా రూ.3 వేల పెన్షన్.. మీరు పొందొచ్చు..

Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం.. వీరికి ప్రతీనెలా రూ.3 వేల పెన్షన్.. మీరు పొందొచ్చు..


దేశంలోని ప్రజలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఇక వివిధ వర్గాల ప్రజల కోసం ప్రత్యేక పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టింది. వీటి గురించి చాలామందికి తెలియక ఉపయోగించుకోలేకపోతున్నారు. తక్కువ ప్రీమియంతో పాటు ఎక్కువ పెన్షన్ ప్రయోజనాలను మీరు పొందవచ్చు. ఇప్పటినుంచే ఈ పథకంలో చేరడం ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలనెలా పెన్షన్ పొందవచ్చు. వృద్దాపంలో మీకు ఆర్ధిక భద్రత కల్పించేందుకు ఇవి సహాయపడతాయి. నెలకు రూ.3 వేల వరకు మీరు పెన్షన్ పొందవచ్చు. ఈ పథకాలు ఏంటి..? ఎవరెవరు చేరవచ్చు..? ఎలా చేరాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఎవరెవరు అర్హులు

-అసంఘటిత రంగ కార్మికులు, వీధి వ్యాపారులు, రిక్షా పుల్లర్లు, వ్యవసాయ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్‌ధన్‌’, ‘పీఎం లఘువ్యాపారి మాన్‌ధన్‌’ పథకాలను ప్రవేశపెట్టింది

– ఐటీ పరిధిలోని రాని రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లుల వ్యాపారులు, చిన్న హోటల్స్ యజమానులు, రిటైల్ షాపుల యజమానులు, చిరు వ్యాపారులు

-నెలవారీ ఆదాయం రూ.15 వేలలోపు ఉండాలి

–EPF, ESI సౌకర్యం లేని ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలతో పాటు చేనేత స్వర్ణకారులు, భవన నిర్మాణ రంగంలో పనిచేసేవారు చేరవచ్చు

-వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి

ప్రీమియం ఎంత..?

-మీ వయస్సును బట్టి ప్రీమియం ఉంటుంది
-తక్కువ వయస్సులో చేరితే ప్రీమియం తక్కువగా ఉంటుంది
-ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.55 చెల్లించాల్సి ఉంటుంది
-40 ఏళ్ల వయస్సులో చేరితే నెలకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది
-60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3 వేలు పెన్షన్ అందిస్తారు
-ఇక పెన్షన్‌దారుడు చనిపోతే నామినీకి నెలనెలా రూ.1500 అందిస్తారు
-ఏ వయస్సులో చేరినా 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఎలా..

సమీపంలోని కామన్ సర్వీసెస్ సెంటర్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకవాల్లసి ఉంటుంది. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *