Telangana: తెలంగాణలో యమపాశంగా మారుతున్న టైఫాయిడ్.. తాజా గణాంకాల్లో షాకింగ్ వివరాలు..!
Telangana: టైఫాయిడ్ వ్యాధి తెలంగాణలో నిశ్శబ్దంగా ప్రమాదకర రూపం దాల్చుతోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల గణాంకాలు చూస్తే.. రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టు స్పష్టమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన అధికారిక రికార్డులు ఈ అంశాన్ని దేశ దృష్టికి తీసుకొచ్చాయి. 2023 ఏడాదికి సంబంధించిన మరణ కారణాల ధృవీకరణ నివేదిక ప్రకారం.. దేశంలో టైఫాయిడ్, పారాటైఫాయిడ్ కారణంగా వెయ్యికి పైగా ప్రాణనష్టాలు నమోదయ్యాయి. ఈ మరణాల్లో తెలంగాణ వాటా అత్యధికంగా…