
బరువైన స్కూల్ బ్యాగులు.. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం..! ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదమే..!
స్కూల్ కి వెళ్లడం పిల్లల జీవితంలో సంతోషంగా ఉండాలి. కానీ ఈ అలవాటు వారి శరీరానికి భారంగా మారి.. అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. పది శాతం వారి శరీర బరువుకు మించి స్కూల్ బ్యాగ్ బరువు ఉండకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంటే 30 కిలోల బరువు ఉన్న పిల్లల బ్యాగ్ 3 కిలోల కంటే ఎక్కువ ఉండకూడదు. వాస్తవానికి పిల్లలు ఎన్నో పుస్తకాలు, నోట్‌బుక్స్, లంచ్ బాక్స్, నీటి బాటిళ్లు, స్టేషనరీ వస్తువులు ప్యాక్ చేసి 6…