Samatha Kumbh 2026: సమతా కుంభ్ …కన్నుల పండువగా శాంతి కల్యాణ మహోత్సవం
ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరిగిన శాంతికళ్యాణ మహోత్సవం.. ఇల వైకుంఠపురాన్ని తలపించింది. శ్రీరామానుజచార్య- 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో ప్రతీ ఘట్టం మహా అద్భుతమే. ఇదంతా రామానుజాచార్య దివ్యాజ్ఞ అంటారు. సకల లోక రక్షకుడికి, సర్వరూప ధారుడికి జరిగే ఈ అద్భుత మహోత్సవానికి భక్తులు వేలసంఖ్యలో పెద్దఎత్తున తరలివచ్చారు. శాంతి కల్యాణ మహోత్సవంలో ముందుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విష్ణు సేనాధిపతి విష్వక్సేనుడికి ఉపచారాలను సమర్పించి, వారి అనుగ్రహాన్ని అక్షత రూపంలో స్వీకరించి వాసుదేవ పుణ్యాహవచనం…