Republic Day 21 Gun Salute: గణతంత్ర వేడుకల్లో 21 గన్ సెల్యూట్ ఎందుకు చేస్తారు..? దీని వెనుక అసలు కథ ఇదే
న్యూఢిల్లీ, జనవరి 26: గణతంత్ర దినోత్సవ కవాతులో 21 గన్ సెల్యూట్ ఆచారం 17వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. ఇది నాటి బ్రిటిష్ వలసరాజ్యాల నౌకాదళం కాలం నాటిది. యుద్ధ నౌకలు శాంతిని కోరుకుంటున్నామని చెప్పడానికి తమ వద్ద ఉన్న మందుగుండును సముద్రంలోకి పేల్చేవి. బ్రిటిష్ నావికాదళ నౌకలు శాంతియుత ఉద్దేశాన్ని ప్రదర్శించడానికి 7 కాల్పులు జరిపేవారు. జ్యోతిషశాస్త్రం, బైబిల్ సంప్రదాయాలలో కూడా ప్రస్తావన ఉంది. ప్రతిగా తీర ప్రాంతంలోని వారు యుద్ధనౌక ప్రయోగించిన ప్రతి షెల్‌కు 3 కాల్పులు…