ఉదయం ఇంట్లోనుంచి బయటకు రాగానే.. భయానక దృశ్యం.. ఇలా ఉన్నారేంట్రా
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పట్టణంలోని బేతాళవాడ ప్రాంతంలో నివాసం ఉంటున్న కొండ మాంతయ్య, కొండ మదునయ్య అనే అన్నదమ్ముల ఇళ్ల ముందు తెల్లవారుజామున నల్లటి ముగ్గులు, వాటిపై కోసిన నిమ్మకాయలు, పసుపు–కుంకుమ కనిపించడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల ముందు ఈ దృశ్యాలను చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన రెండు ఇళ్లను టార్గెట్ చేసి క్షుద్ర పూజలు నిర్వహించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి….