అంతా ఓకే అనుకున్న తర్వాత అతను హ్యాండ్ ఇచ్చాడు.. ఆ హీరో నాకు నో చెప్పాడు: గోపీచంద్ మలినేని
టాలీవుడ్ లో తన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు దర్శకుడు గోపిచంద్ మలినేని. మాస్ సినిమాలతో మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు గోపిచంద్ మలినేని. రవితేజ క్రాక్, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. అలాగే బాలీవుడ్ లో జాట్ అనే సినిమా చేశాడు. సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు బాలకృష్ణతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు గోపిచంద్ మలినేని….