Andhra Pradesh: ఏపీలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో కొత్త కార్యక్రమం.. రైతులందరికీ బెనిఫిట్
ఏపీలోని రైతులకు లబ్ది చేకూర్చేలా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు త్వరలో కొత్త కార్యక్రమం చేపట్టనుంది. ఈ మేరకు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు జారీ చేశారు. తాజాగా సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్‌పై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్గానిక్ వ్యవసాయంలో ఏపీని టాప్‌లో నిలపడంలో భాగంగా కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు…