ఆముదం నూనెలో యాంటీ బాక్టీరియల్, మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఆధునిక జీవనశైలిలో, జుట్టు రాలడం, అకాల వృద్ధాప్యం వంటి అనేక రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వారికి ఆముదం నూనే గొప్పగా పనిచేస్తుంది. ఇందులో రిసినోలిక్ ఆమ్లం అనే కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.
జుట్టు పెరుగుదలకు : ఆముదం నూనె జుట్టుకు చాలా ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జుట్టు మూలాలను బలంగా చేసి.. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. అయితే ఇది చాలా బరువైన నూనె, కాబట్టి దీనిని కొబ్బరి నూనెతో కలిపి అప్లై చేయాలి.
చర్మానికి మాయిశ్చరైజర్ : ఇది అద్భుతమైన సహజ మాయిశ్చరైజర్. పొడిబారిన, పగిలిన చర్మంపై దీనిని అప్లై చేయడం వల్ల మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది మడమలు, మోచేతులపై ప్రభావవంతంగా ఉంటుంది. అయితే, దీనిని అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి.
గాయాలు – వాపులు : ఆముదం ఆయిల్లో ఉండే రిసినోలిక్ ఆమ్లం అనే మూలకం వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు మీరు తేలికపాటి గాయాలను నయం చేయడానికి కూడా ఈ నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనెను అప్లై చేయడం వల్ల కండరాల నొప్పి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
కనుబొమ్మలు : ఆముదం జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. మీరు కనుబొమ్మలు చాలా తేలికగా ఉన్నాయని అనిపిస్తే ఆముదం నూనెను ట్రై చేయండి. దీని వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.