Car Mileage Tips: కారు కొన్న కొత్తలో కాస్త మైలేజీ తక్కువగా ఇస్తుంది. ఆ తరువాత సర్వీస్ చేయించే కొద్ది మైలేజీ పెరుగుతంది. ఇక కారు పాతపడే కొద్ది, వినియోగం సరిగా లేకపోయినా, ఏదైనా టెక్నికల్ సమస్య ఉన్నా కారు మైలేజీ క్రమంగా తగ్గుతుందని చాలా మంది తరచుగా చెబుతుంటారు. అయితే కారు మైలేజీ తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు ఆటో టెక్ నిపుణులు. కారు మైలేజీ తక్కువ ఇస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీని వల్ల ఖర్చు పెరుగుతుంది. మీ వాహనం మైలేజీ పెంచుకోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. అవేంటో చూద్దాం.
కారు మైలేజీని ఈ విధంగా పెంచుకోండి..
- కారు మైలేజీని పెంచుకోవడానికి సులభమైన పద్దతులున్నాయి. అతి ముఖ్యమైన మార్గాల్లో ఒకటి టైర్‌లో గాలి. మీ కారు టైర్ల నిర్వహణ సరిగా చూసుకోవాలి. టైర్లలో గాలి తగ్గితే.. ఆటోమేటిక్‌గా మైలేజీ కూడా తగ్గుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అందుకే డ్రైవ్ చేయడానికి ముందు మీ కారు టైర్ పరిస్థితిని చెక్ చేసుకోవడం మంచిది.
- ప్రయాణంలో కారు కిటికీలను తెరిచి ఉంచడం వల్ల కూడా కారు మైలేజీ ప్రభావితం అవుతుంది. దీని కారణంగా కారు ఇంజిన్ వేగం తగ్గి, ఇంధనం ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే ప్రయాణ సమయంలో కారు అద్దాలు పూర్తిగా మూసివేయాలి.
- మీరు అధిక వేగంతో వెళ్లినా మైలేజీ తక్కువ ఇస్తుందని గుర్తించుకోండి. కారును ఎప్పుడూ ఒకే స్పీడ్‌తో మెయింటెన్ చేస్తూ, సాఫీగా నడపాలి. కారు వేగాన్ని ఒకేవిధంగా నిర్వహిస్తే.. మైలేజీని 30 శాతం వరకు పెంచుకోవచ్చు.
- ఇక మైలేజీని మెరుగుపరుచుకోవడానికి మోటార్ ఆయిల్ నాణ్యత కూడా ముఖ్యమైనది. నాణ్యమైన ఆయిల్ ను ఎంచుకోవాలి. చాలా కార్లలో సరైన ఆయిల్ యూజ్ చేయకపోవడం మైలేజీ తగ్గుతుంది. సరైన ఆయిల్‌ను అప్‌గ్రేడ్ చేయడం ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గి.. మైలేజీ పెరుగుతుంది.
- రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు రెడ్ సిగ్నల్ పడితే కారు ఇంజిన్‌ను ఆఫ్ చేయాలి. అలాగే అవసరం లేకుండా ఇంజిన్‌ను ఆన్ చేసి ఉంచొద్దు. తరచుగా బ్రేక్స్ వేయడం వల్ల కూడా మైలేజీ తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి