Business Idea: కేవలం రూ.1 లక్షతో భారీ ఆదాయం ఇచ్చే టాప్‌ 5 బిజినెస్‌లు! అది కూడా మీ సొంతూర్లో..

Business Idea: కేవలం రూ.1 లక్షతో భారీ ఆదాయం ఇచ్చే టాప్‌ 5 బిజినెస్‌లు! అది కూడా మీ సొంతూర్లో..


చాలా మందికి ఒక మంచి బిజినెస్‌ చేయాలని ఉంటుంది. కానీ పెట్టుబడి లేక, సరైన బిజినెస్‌ ఐడియా లేక ఆగిపోతుంటారు. ఇష్టంలేని జాబులు చేస్తూ ఒక యంత్రంలా పనిచేస్తుంటారు. అయితే అతి తక్కువ పెట్టుబడితో గ్రామాల్లో చేయగలిగే టాప్‌ 5 బిజినెస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఇవి తక్కువ రిస్క్, స్థిరమైన డిమాండ్, త్వరగా నగదు ప్రవాహం కలిగే రంగాలు.

పాలు, డెయిరీ ఉత్పత్తుల వ్యాపారం

పెట్టుబడి రూ.80,000 నుంచి రూ.1,00,000 వరకు అవ్వొచ్చు. ఒకటి లేదా రెండు పాలు ఇచ్చే ఆవులు/ఎద్దులు కొనుగోలు చేసి పాలు అమ్మడం ప్రారంభించవచ్చు. గ్రామాల్లో పాలు, పెరుగు, పన్నీర్‌కు నిరంతర డిమాండ్ ఉంటుంది. ఖర్చులన్నీ పోనూ నెలకు రూ.15,000– రూ.25,000 వరకు సంపాదించుకోవచ్చు.

మొబైల్ రిపేర్ అండ్‌ యాక్సెసరీస్ షాప్

దీనికి పెట్టుబడి రూ.60,000 నుంచి రూ.1,00,000 వరకు అవ్వొచ్చు. చిన్న షాప్ అద్దెకు తీసుకుని మొబైల్ రిపేర్, చార్జర్లు, ఇయర్‌ఫోన్లు, కవర్లు అమ్మవచ్చు. రోజుకు 10–15 కస్టమర్లు వచ్చినా నెలకు రూ.20,000 పైగా సంపాదించవచ్చు. గ్రామాల్లో టెక్నికల్ సేవలు తక్కువగా ఉండటం వల్ల మంచి అవకాశముంది.

కిరాణా దుకాణం

పెట్టుబడి రూ.1,00,000 అవ్వొచ్చు. రోజువారీ అవసరాల సరుకులు బియ్యం, పప్పులు, నిత్యవసరాలు నిల్వ ఉంచాలి. 10 నుంచి 20 శాతం మార్జిన్ సాధారణం. స్థిరమైన కస్టమర్ బేస్ ఏర్పడుతుంది. డిజిటల్ పేమెంట్స్ సదుపాయం కల్పిస్తే అమ్మకాలు పెరుగుతాయి.

కోళ్ల పెంపకం (పౌల్ట్రీ)

ఈ వ్యాపారం కోసం పెట్టుబడి రూ.80,000 రూ.1,00,000 వరకు అవ్వొచ్చు. 100–200 కోళ్లతో ప్రారంభించవచ్చు. మాంసం, గుడ్లకు నిరంతర డిమాండ్ ఉంటుంది. ఈ బిజినెస్‌ సక్సెస్‌ అవ్వాలంటే సరైన ఫీడ్, వైద్య సంరక్షణ అవసరం.

మిరప పొడి / పసుపు పొడి వంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్

పెట్టుబడికి రూ.70,000 నుంచి రూ.1,00,000 వరకు అవ్వొచ్చు. గ్రామాల్లో లభించే వ్యవసాయ ఉత్పత్తులను శుభ్రపరచి, గ్రైండ్ చేసి ప్యాకింగ్ చేసి అమ్మవచ్చు. 20 నుంచి 30 శాతం వరకు మార్జిన్ సాధ్యం. సమీప పట్టణ మార్కెట్లలో కూడా విక్రయాలు చేపట్టవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *