Bullet Train: ముంబై–అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్ (MAHSR) భారత్‌లోని తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్. మొత్తం 508 కిలోమీటర్ల పొడవు గల ఈ ప్రాజెక్ట్ జపాన్ ప్రభుత్వ సాంకేతిక, ఆర్థిక సహాయంతో అభివృద్ధి చేస్తోంది కేంద్రం. గరిష్టంగా గంటకు 320 కి.మీ. (సుమారు 200 మైళ్లు) వేగంతో నడిచేలా రూపొందించిన ఈ హై-స్పీడ్ రైలు మార్గం మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా అండ్ నగర్ హవేలీ ప్రాంతాలను 12 వ్యూహాత్మక స్టేషన్ల ద్వారా అనుసంధానిస్తుంది.
భూసేకరణ పూర్తిచేసిన ప్రాజెక్ట్
508 కి.మీ. పొడవైన ఈ కారిడార్‌కు అవసరమైన మొత్తం 1389.5 హెక్టార్ల భూసేకరణ పూర్తయింది. అన్ని చట్టపరమైన అనుమతులు కూడా పొందింది. మహారాష్ట్రలో భూసేకరణ ఆలస్యం కారణంగా ప్రారంభంలో కొంత మందగమనముండగా, 2022 నుంచి పనులు వేగంగా సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి
స్టేషన్లు, నిర్మాణ పురోగతి:
ఈ కారిడార్‌లోని స్టేషన్లు: ముంబై (BKC), థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదరా, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి.
గుజరాత్‌లోని 8 స్టేషన్లలో (వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, ఆనంద్, వడోదరా, అహ్మదాబాద్, సబర్మతి) పునాది పనులు పూర్తయ్యాయి. మహారాష్ట్రలో థానే, విరార్, బోయిసర్ స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయి. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) స్టేషన్ వద్ద తవ్వకాలు చివరి దశలో ఉండగా, బేస్ స్లాబ్ కాస్టింగ్ ప్రారంభమైంది.
టికెట్ ధరలు:
రైల్వే మంత్రి Ashwini Vaishnaw లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో బుల్లెట్ ట్రైన్ టికెట్ ధరలు ప్రస్తుత రైలు, విమాన ప్రయాణ ఛార్జీలకు పోటీగా ఉండేలా ప్రతిపాదించామని తెలిపారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య ఎకానమీ క్లాస్ విమాన ఛార్జీలు, ప్రీమియం రైలు సర్వీసుల (AC చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్) ధరలకు సమానంగా టికెట్ ధరలను నిర్ణయించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. వ్యాపార, వినోద ప్రయాణికులకు సమయపరంగా వేగవంతమైన, ఖర్చు పరంగా సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయంగా ఈ సేవను నిలపడం లక్ష్యం.
సాంకేతికత, భద్రత:
ఈ ప్రాజెక్ట్ జపాన్ శింకాన్సెన్ సాంకేతికత ఆధారంగా భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దుకుంది. అత్యున్నత భద్రతా ప్రమాణాలు, నిర్వహణ విధానాలను అనుసరిస్తున్నారు. సుమారు 1,000 మంది భారతీయ ఇంజనీర్లు, నైపుణ్య కార్మికులకు జపాన్ విధానాల్లో శిక్షణ ఇచ్చింది. సూరత్‌లో ప్రత్యేక ట్రాక్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి, నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నిర్మాణ పురోగతి:
* గుజరాత్‌లో 352 కి.మీ. పునాది, పియర్ పనులు పూర్తయ్యాయి. 331 కి.మీ. గిర్డర్ లాంచింగ్ పూర్తి.
* మహారాష్ట్రలో 74 కి.మీ. పునాది, 65 కి.మీ. పియర్ పనులు పూర్తయ్యాయి.
* మొత్తం 17 నదీ వంతెనలు పూర్తయ్యాయి.
* గుజరాత్‌లో నర్మదా, మాహి, తాపీ, సబర్మతి వంటి ప్రధాన నదులపై వంతెనల పనులు తుదిదశలో ఉన్నాయి.
* మహారాష్ట్రలో 4 నదీ వంతెనల పనులు కొనసాగుతున్నాయి.
* థానే, సూరత్, సబర్మతి డిపోల్లో పనులు వేగంగా సాగుతున్నాయి.
పౌర నిర్మాణాలు, ట్రాక్, విద్యుత్, సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, రైలు సెట్ల సరఫరా పనులు పూర్తయ్యాక ప్రాజెక్ట్ పూర్తి గడువును ఖచ్చితంగా నిర్ణయించవచ్చని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రయాణికుల డిమాండ్, సమయ ఆదా, ఆర్థిక అభివృద్ధి, ప్రాంతీయ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకుంది.
Gold Price: భారీ పతనం.. గ్రాము బంగారం ధర రూ.10 వేలకు చేరనుందా..? షాకింగ్ నివేదిక
ఇది కూడా చదవండి: Rental Agreement: రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలకే ఎందుకు చేస్తారు? అసలు సీక్రెట్ ఇదే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి